రాజకీయాలపై రెహమాన్ కల్లోలం

0

Sarkar-second-single-Oru-Viral-Puratchi-goes-viralరెహమాన్ అంటే కమర్షియల్ గీతాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన నుంచి ఓ ఆల్బమ్ వస్తోందంటే ఎన్ని వెస్ట్రన్ ట్యూన్స్ వస్తాయా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి రెహమాన్ నుంచి ఎవరూ ఊహించని రీతిలో ఓ విప్లవ గీతం వచ్చింది. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది మరెవరో కాదు విభిన్న చిత్రాల దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్. విజయ్ హీరోగా తమిళంలో ఎ.ఆర్. మురుగదాస్ `సర్కార్` పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సమకాలీన రాజకీయాలపై వ్యంగ్రాస్త్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన `సిమ్టాంగరన్..` అనే పల్లవితో సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటలోని పదాలు అర్థం కాలేదని సోషల్ మీడియాలో పెను దుమారమే చెలరేగింది. తాజాగా ఈ చిత్రానికి `ఒరు విరల్ పురట్చి..` అనే విప్లవ గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటను ఎ.ఆర్.రెహమాన్ పాడటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

పాలిటిక్స్పై కాస్తంత వ్యంగ్యంగా ఉన్న ఈ గీతం జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది. కేవలం 21 గంటల్లోనే 4 లక్ష లైక్స్ తో ఇప్పటికే 33.26 లక్షల మంది జనం విన్నారు. ఈ గీతం సినిమాకే హైలైట్గా నిలవనుందని చెబుతున్నారు. ఎన్నికల వేల ఓటు ప్రాధాన్యతను తెలియజేస్తూ కాస్తంత వ్యంగ్యంగా ఈ పాట సాగుతుందని చెబుతున్నారు. రెహమాన్ ఇదివరకూ `యువ` చిత్రంలో యువశక్తిని ఆవిష్కరించే టైటిల్ విప్లవ గీతానికి అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. తాజాగా సర్కార్ గీతం ఆ రేంజులో ఉందన్న టాక్ వినిపిస్తోంది.
Please Read Disclaimer