అనుష్కపై ట్విట్టర్ లో పేలుతున్న సెటైర్లు

0ఈ సోషల్ మీడియా జనరేషన్ లో అంతా ఫసక్కే. మీనింగ్ ఏంటని వెర్రి ప్రశ్న వేస్తే మిమ్మల్ని ఫసక్కనుకునే ఘోరప్రమాదం ఉంది కాబట్టి అడగొద్దు. తెలుగు లెజెండరీ నటుడు మంచు మోహన్ బాబు మీద మాత్రమే ట్విట్టర్ లో ఫన్నీ మెమెస్ తయారు చేసి నవ్వుకున్తున్నారంటే మీరు మళ్ళీ ఫసక్కు లో కాలేసినట్టే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కు కూడా ఈ నెటిజనుల మెమెస్ బెడద తప్పడం లేదు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. అనుష్క శర్మ ‘సూయిధాగా'(తెలుగులో మీనింగ్ సూది దారం) అనే ఒక సినిమాలో నటిస్తోంది. హీరో వరుణ్ ధావన్. ఇద్దరూ ఒక పేద కుటుంబానికి చెందిన భార్యభర్తలుగా నటిస్తున్నారు. వరుణ్ ఇందులో ఒక టైలర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఇద్దరూ మేకప్పు లేకుండా వీలైంత సహజమైన గెటప్పులలో కనిపిస్తున్నారు. ఇక అనుష్క కనిపించడం కాదు అసలు నిజంగా పేద దర్జీ భార్య ఏమో అన్నంతగా పాత్రలో లీనమయింది. ట్రైలర్ లో ఆమె ఎక్స్ ప్రెషన్స్ అయితే మీ గుండె నరాలను(ఒకవేళ ఉంటే) కసక్కున తెంపేలా ఉన్నాయి. దీంతో ట్విట్టర్ లో మెమెస్ తయారు చేసిపెట్టి ఒకటే నవ్వులు.

* ఒక ఫోటోలో చంద్రమండలం పై అడుగుపెట్టిన ఫస్ట్ లేడీ ఆస్ట్రోనాట్. చంద్రమండలంపై అడుగుపెట్టి ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోయిన ఎక్స్ ప్రెషన్

* ఇంకో ఫోటోలో రియల్ లైఫ్ అనుష్క శర్మ-విరాట్ కోహ్లి తో కలిసి సూయిధాగా అనుష్క తో కలిసి తల ఆమె నిమురుతూ పోజిచ్చింది.

* ఈసారి మహాత్మా గాంధీ సభలో అచ్చం పల్లెటూరి బైతులా కూర్చోని శ్రద్దగా అయన స్పీచ్ వింటోంది. పాపం గాంధీ కుడా ఫసక్కే!

* ఇక స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ.. మోనాలిసా.. ఇలా ఒకటి కాదు చాలా చాలా ఉన్నాయి.

మనకు గతంలో బ్రమ్మి అన్ని గెటప్పులో ఉన్నన్ మెమెస్ ఉండేవి కదా. అలా ఇప్పుడు హిందీ వాళ్ళకు అనుష్క!