హీరో సారీ చెబితే సినిమా చూస్తారా?

0Nani-in-Ninnukoriడిస్ట్రీబ్యూషన్ సెక్టార్ లో టాక్ ఎలా ఉన్నప్పటికీ క్లాస్ ఆడియెన్స్ ని మెప్పిస్తూ వరుస హిట్లు కొడుతున్నాడనే బ్రాండింగ్ తో న్యాచురల్ స్టార్ నాని కెరీర్ సాగిపోతుంది. తాజాగా నాని సినిమా నిన్నుకోరి కూడా కాస్త అటుఇటుగా ఇదే నేపథ్యంతో హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఎలాగైనా తన సినిమాని మాస్ ఆడియెన్స్ కు చేరవేసేందుకు మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నాడు నాని.

సినిమాకి ముందు ప్రచారం పై కాన్సన్ ట్రేట్ చేయని నాని ఇప్పుడు వరుసపెట్టి పెద్ద న్యూస్ ఛానల్స్ కి లైవ్ ఇంటర్ వ్యూస్ ఇస్తున్నాడు. అంతేకాదు లైవ్ లో మాస్ ఆడియెన్స్ ను తక్కువుగా అంచనా వేసా అని అసలు క్లాస్ మాస్ తేడా అనేది సినిమాకి ఉండదని చెబుతూ నిన్నుకోరి అక్కున చేర్చుకున్న ప్రేక్షకులకి థ్యాంక్ అని మాస్ ఆడియెన్స్ కి పెద్ద సారీ అని తెలిపాడు.

నాని ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ ఇప్పుడు సోషిల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొంతమంది నాని ఈజ్ సో స్వీట్ అంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొంత మంది సారీ చెబితే సినిమా చూసేస్తారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదైతేనేం నిన్నుకోరి సినిమా కేవలం క్లాస్ వాళ్లకోసమే తీసినట్లుగా తన సారీతో చెప్పకనే చెప్పేసాడు నాని. మరి ఈ క్లాస్ చిత్రాన్ని మాస్ ఆడియెన్స్ ఏ రీతిన ఆదిరిస్తారో చూడాలి.