వర్మను టార్గెట్ చేసిన ట్రైలర్

0

‘‘రాముడి లాంటి వాడు పుడతాడని పూజలు చేస్తే.. రామ్ గోపాల్ వర్మ లాంటి వాడు పుట్టాడు’’..
‘‘అసలు మీరేం చేస్తుంటారు?’..
‘‘రామ్ గోపాల్ వర్మలాగా..’’
‘‘సినిమాలు చేస్తుంటారా?’’
‘‘లేదు. ఉదయాన్నే లేచి పోర్న్ చూస్తుంటాను’’

ఇవీ ‘బేవర్స్’ అనే కొత్త సినిమా ట్రైలర్ ఆరంభంలో వచ్చే డైలాగ్స్. మామూలుగా రామ్ గోపాల్ వర్మే వాళ్లను వీళ్లను గిచ్చుతుంటాడు. కానీ ఈ చిత్ర బృందం వర్మనే గిచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ రోజుల్లో చిన్న సినిమాల మీద జనాలు ఊరికే ఆసక్తి ప్రదర్శించరు. ఏదో ఒక సెన్సేషనల్ కంటెంట్ ఉంటే తప్ప జనాలకు వాటి మీద దృష్టి మళ్లదు. అందుకే ఇలా వర్మను టార్గెట్ చేసి ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేసినట్లున్నారు. ఈ డైలాగ్స్ సంగతలా ఉంచితే.. ‘బేవర్స్’ ట్రైలర్ చూస్తే.. తెలుగులో చాలాసార్లు చూసిన తండ్రీ కొడుకుల కథతోనే ఈ సినిమా తెరకెక్కినట్లు అనిపిస్తోంది.

సమాజంలో గౌరవంగా బతికే తండ్రి.. బాధ్యత లేకుండా బేవర్సుగా తిరిగే కొడుకు.. ఇద్దరి మధ్య ఘర్షణ.. ఈ నేపథ్యంలో కామెడీ.. ఐతే ఒక సీరియస్ సమస్య తలెత్తినపుడు ఆ కొడుకులో మార్పు వచ్చి తండ్రి కోసం నిలబడి పోరాడే కథతో ఈ సినిమా తెరకెక్కినట్లు కనిపిస్తోంది. తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేశారు. కొడుకుగా కొత్త కుర్రాడు సంజోష్ నటించాడు. హర్షిత కథానాయిక. కొత్త హీరో అయినప్పటికీ.. తెలుగు సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే కమర్షియల్ హంగులన్నీ అద్దినట్లున్నారు. హీరో పాత్రను కూడా ఆ తరహాలోనే డిజైన్ చేసినట్లున్నారు. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్లు ఓకే అనిపిస్తున్నాయి. ‘జ్యోతిలక్ష్మీ’.. ‘లోఫర్’ లాంటి సినిమాలకు సంగీతం అందించిన సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి పని చేశాడు. చందు-మూర్తి-అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి రమేష్ చెప్పల దర్శకత్వం వహించాడు. మరి ఈ చిన్న సినిమా జనాల్ని ఏమేరకు థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి.
Please Read Disclaimer