సవ్యసాచి ట్రైలర్ టాక్: చెయ్యెత్తించే థ్రిల్లర్!

0

నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన సవ్యసాచి ట్రైలర్ విడుదలైంది. ఎడమ చేయి తన ఆధీనంలో ఉండని ఒక వెరైటీ పాత్రను పోషిస్తున్న చైతుకి ఇది చాలా స్పెషల్ ఫిలిం గా ఉండబోతోందని అభిమానులు ముందు నుంచి గట్టి నమ్మకంతో ఉన్నారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టే ట్రైలర్ ఉండటం విశేషం. టీజర్ ను డీ కోడ్ చేసిన దాన్ని బట్టి కథ లైట్ గా ఈ కోణంలో అర్థమవుతోంది.

విక్రమ్ ఆదిత్య సరదాగా జీవితాన్ని గడిపే యువకుడు. అతనికో అక్కయ్య. భూమిక. చీకు చింతా లేకుండా స్నేహితులు ప్రేమ లాంటివాటితో లైఫ్ ని లీడ్ చేస్తున్న చైతు జీవితంలోకి ఓ రావణుడు వస్తాడు. అతనే మాధవన్. అల్లకల్లోలం మొదలుపెడతాడు. బయటికి రావడం దుర్లభం అనిపించే పద్మవ్యూహాన్ని అతని చుట్టూ వల పన్నుతాడు. దీని వల్ల చైతు ఊహించని ప్రమాదాలు ఎదురుకోవాల్సి వస్తుంది. అసలు అతను ఎందుకు వచ్చాడు ప్రాణాల మీదకు వచ్చే సవాళ్ళను ఎందుకు ఇచ్చాడు అనేది సస్పెన్స్. దీన్నుంచి సవ్యసాచి ఎలా బయటపడ్డాడో స్టోరీ లైన్ గా కనిపిస్తోంది.

చందు మొండేటి మరోసారి తన బలమైన స్క్రీన్ ప్లే తో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. ట్రైలర్ ఓపెనింగ్ షాట్ లోనే మాధవన్ ని చూపించడం ద్వారా అతని పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతోందో చూపించిన చందు ఆ తర్వాత చైతు పాత్రను రివీల్ చేసిన తీరు కట్ చేసిన విజువల్స్ అన్ని ఆసక్తి రేపెలా ఉన్నాయి. చివరిలో తాగుబోతు రమేష్ తో చైతు పాత్రను అభిమన్యుడుతో కాకుండా అర్జునుడితో పోల్చడం బాగా పేలింది. మాధవన్ విలనీ ఫ్రెష్ గా అనిపించగా చైతు యధావిధిగా హ్యాండ్ సంగా ఉన్నాడు.

నిధి అగర్వాల్ తో సహా ఇతర తారాగణాన్ని ఎక్కువ హై లైట్ చేయలేదు. కీరవాణి సంగీతం బ్యాక్ గ్రౌండ్ లో ఎలివేట్ కాగా యువరాజ్ ఛాయాగ్రహణం టాప్ స్టాండర్డ్స్ లో ఉంది. మొత్తానికి చేయి అధీనంలో ఉండని ఒక సరికొత్త పాత్రలో థ్రిల్ చేయించే నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే హిట్టు పడ్డట్టే.
Please Read Disclaimer