‘సవ్యసాచి’ వచ్చేది అప్పుడే

0నాగ చైతన్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘సవ్యసాచి’. చందూ మొండేటి దర్శకుడు. . నిధి అగర్వాల్‌ కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో అమెరికాలో మరో షెడ్యూల్‌ జరగబోతోంది. దాంతో చిత్రీకరణ పూర్తవుతుంది. ఈనెల 18న ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తారు. జూన్‌ 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఇందులో మాధవన్‌తోపాటు భూమిక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు .

దీంతో పాటు ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాలో నటిస్తున్నాడు చైతు. ఈ సినిమాకి మారుతి దర్శకుడు. ఈ సినిమా తర్వాత శివ నిర్వాన దర్శకత్వం ఓ సినిమా చేయనున్నాడు. ఈ ‘ప్రేయసి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తారని గుసగుసలు వెలువడుతున్నాయి. ఈ విషయమై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.