సమంత ఇంటికి అఖిల్ హీరోయిన్

0Sayesha-Saigalటాలీవుడ్ లో హీరోయిన్ గా మాంచి ఆఫర్స్ దక్కించుకోవాలంటే.. చాలానే అర్హతలు కావాలి. ఇప్పటివరకూ నిర్మాతలు కన్సిడర్ చేసిన వాటికి.. లేటెస్ట్ గా యాడ్ అయిన పాయింట్ ఏంటంటే.. ఇక్కడే ఉండి అందుబాటులో ఉండడం. హైద్రాబాద్ లో ఇల్లు ఉన్న అందాల భామలు అయితే.. అందుబాటులో ఉంటారు.. ఖర్చులు తగ్గుతాయి.

ఈ పాయింట్ ని రకుల్ ప్రీత్.. రాశి ఖన్నా లాంటి హీరోయిన్లు ఇప్పటికే క్యాష్ చేసేసుకోగా.. ఇప్పుడు మరో బ్యూటీ అసలు విషయాన్ని పసిగట్టేసింది. అక్కినేని అఖిల్ తో కలిసి.. అఖిల్ మూవీతో సినీ అరంగేట్రం చేసిన సాయేషా సైగల్.. ఇప్పుడు హైద్రాబాద్ లో ఇల్లు కొనేస్తోంది. చాలా కాలంగా ఇక్కడో ప్రాపర్టీ కొనాలని చూస్తున్న ఈ భామకు.. సడెన్ గా అవకాశం రావడంతో.. దాన్ని వెంటనే చేజిక్కించుకుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇదే ఇంటిలో గతంలో సమంత నివసించేది. ఇప్పుడు అదే హౌస్ కొత్త భామ సాయేషా సొంతం అయిపోయింది. ఇక్కడ షూటింగ్స్ ఉన్నపుడు.. వీలైనంత వరకూ హైద్రాబాద్ లోనే ఉంటూ.. నిర్మాతలపై ప్రెజర్ తగ్గించాలన్నది సాయేషా ఉద్దేశ్యంగా చెబుతున్నారు.

రీసెంట్ గా జయం రవి మూవీ వనమగన్ తో.. తమిళ్ అరంగేట్రం చేసిన సాయేషా.. కరుప్పు రాజా వేళ్లై రాజా అంటూ మరో సినిమా చేసేస్తోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ మేకర్స్ ఈ భామతో చర్చలు జరుపుతుండగా.. త్వరలోనే టాలీవుడ్ లో తన కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేస్తానంటోంది సాయేషా సైగల్.