పాటతో గేలం వేస్తున్న అఖిల్ పోరి

0టాలీవుడ్ లో అఖిల్ సినిమాతో పరిచయమైన ముంబై భామ సాయేశా సైగల్ సౌత్ మీద పెద్ద కన్నే వేసింది. బాలీవుడ్ లో అవకాశాలు అంతంత మాత్రంగా ఉండటంతో పాటు అజయ్ దేవగన్ లాంటి హీరోతో చేసిన శివమ్ సినిమా కూడా చేదు ఫలితం ఇవ్వడంతో పూర్తి ఫోకస్ ఇక్కడే పెడుతోంది. తమిళ్ లో కార్తీ సరసన చేసిన చినబాబు త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. పక్కా పల్లెటూరి అమ్మాయిగా సాయేషా నటించిన ఈ మూవీపై భారీ ఆశలే పెట్టుకుంది. ఇది కనక హిట్ అయితే తమిళ్ ప్రేక్షకులు హీరోయిన్లను ఏ స్థాయిలో అభిమానిస్తారో తనకు తెలుసు. హన్సిక లాంటి వాళ్ళు ఏకంగా గుళ్ళు కూడా కట్టించుకునే రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే తాను కూడా వాళ్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలే తన ట్విట్టర్ అకౌంట్ లో క్యాజువల్ డ్రెస్ లో సంక్రాంతికి వచ్చిన సూర్య సినిమా గ్యాంగ్ తమిళ పాటకు స్టెప్స్ వేస్తూ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

చాలా ఈజ్ తో వేసిన స్టెప్స్ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఎలాగూ తమ్ముడితో చేస్తోంది. పనిలో పనిగా అన్నయ్య ఫాన్స్ కు కూడా వల వేస్తే ఓ పనైపోతుంది అనుకుంది కాబోలు ఇలా డ్యాన్సింగ్ టాలెంట్ ను బయట పెట్టుకుంటోంది. చినబాబు కాకుండా తమిళ్ లో ఆర్య సరసన గజినీకాంత్ చేస్తోంది సాయేషా. ఇది నాని భలే భలే మగాడివోయ్ రీమేక్. విజయ్ సేతుపతి తో జుంగా అనే మరో సినిమా కూడా తన ఖాతాలో ఉంది. మొత్తం ఈ ఏడాది మూడు సినిమాలతో కోలీవుడ్ లో రచ్చ చేస్తోందీ భామ. బాలీవుడ్ నటదిగ్గజం దిలీప్ కుమార్ కుటుంబం నుంచి వచ్చిన సాయేషా హిందీ సినిమాల్లో తన ఉనికిని చాటుకోలేకపోయినా తమిళనాట తన జెండా నాటే ప్రయత్నం గట్టిగానే చేస్తోంది.