ఎస్‌బీఐ మనీ ట్రాన్సఫర్‌లపై కొత్త చార్జీలు

0


sbi-revises-imps-money-tranదేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ ) జీఎస్టీ నేపథ్యంలో ఐఎంపీఎస్ (ఇమ్మిడియేట్‌ పేమెంట్‌ సర్వీస్‌) మనీ ట్రాన్సఫర్లపై కొత్త చార్జీలను ప్రకటించింది. రూ.1000 కి ఎలాంటి చార్జీలు లేకుండా, రూ.1000 నుంచి రూ.1 లక్ష కు రూ.5+జీఎస్టీ , రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల ట్రాన్సఫర్లకు రూ.15+జీఎస్టీ చార్జీలను ఖరారు చేసింది.

ఇక బ్యాంకింగ్‌ సేవలకు జీఎస్టీ 18శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చార్జీలను ఎస్‌బీఐ తమ అధికారిక ట్వీటర్‌లో పోస్టు చేసింది. ఐఎంపీఎస్‌ సర్వీసులంటే మొబైల్‌ ఫోన్లు లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా వెనువెంటనే నగదును బెనిఫిషియరీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు. ఈ సర్వీసులు సెలవు రోజులతో సహా 24×7 అందుబాటులో ఉంటాయి. ఎస్‌బీఐ ఇటీవలే తన ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకును తనలో విలీనం చేసుకుంది. ఈ విలీనాంతరం టాప్‌50 గ్లోబల్‌ బ్యాంకుల్లో ఎస్‌బీఐ చోటు దక్కించుకుంది.