షకలక శంకర్ కోసం బాహుబలి గర్ల్..

0టాలీవుడ్ లో ఐటం సాంగ్ లకు కొదవ లేదు.. ఆ ఐటం సాంగ్ ల కోసమే కొందరు సినీ అభిమానులు థియేటర్స్ కు వస్తారు. వారిని మెప్పించడానికి ప్రతీ దర్శకుడు ఈ హాట్ పాటలకు ప్రాధాన్యం ఇస్తాడు. రంగస్థలం తీసిన సుకుమార్ నుంచి దర్శకుడు రాజమౌళి వరకూ ఈ ఐటం సాంగ్ ఫార్ములాను పాటిస్తూనే ఉంటారు.

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో ఓ ఐటం సాంగ్ తో ‘స్కార్లెట్ విల్సన్’ టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆ తరువాత బాహుబలి 1 సినిమాలో ‘మనోహర’ పాటతో ఫేమస్ అయ్యింది.ఈ బ్రిటీష్ అందం వరుసగా ఐటం సాంగ్ లు చేస్తూ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకుంటోంది. ఆమె డ్యాన్స్ మూమెంట్లకు ఫిదా అయ్యి దర్శకులు వరుసగా ఆఫర్స్ ఇస్తున్నారు.

తాజాగా స్కార్లెట్ విల్సన్ కు మరో అవకాశం వచ్చింది. షకలక శంకర్ హీరోగా నటిస్తున్న ‘డ్రైవర్ రాముడు’ సినిమాలో ఓ ఐటం సాగ్ చేయడానికి ఓకే చెప్పింది. ఈ సినిమా డైరెక్టర్ రాజ్ సత్య ఐటంసాంగ్ చేయడానికి పట్టుబట్టడంతో కాదనలేకపోయిందట.. భారీగా ఆఫర్ చేశాడట.. దీంతో కామెడీ హీరో అయినా కూడా షకలక శంకర్ సినిమాలో ఐటం సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్టు తెలిసింది. ఐటం సాంగులతో డబ్బుతోపాటు పేరు కూడా వస్తుండడంతో స్కార్లెట్ వెనుదిరిగి చూసుకోవడం లేదు.