చెంప చెల్లుమనిపించిన బాహుబలి బ్యూటీ

0Umakant-Rai-for-his-misbehaనిన్నటి న్యూస్ ఏంటంటే.. ఐటెం సాంగ్స్ తో పాపులరైన స్కార్లెట్ మెలిష్ విల్సన్ తో అసభ్యంగా ప్రవర్తించాడని ఒకతని చెంపను సెట్స్ మీద చెళ్ళుమని అనిపించిందని.. అతన్ని ఆ సెట్ నుండి బయటకు తోసిపాడేశారని.. అతనిపై కంప్లయిట్ కూడా ఫైల్ చేశారని తెగ వినిపించింది. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అందుకే కేవలం చెంపపై ఆర్టిఫీషియల్ గా అమ్మడు కొడుతున్న సీన్.. ఆ తరువాత అతను సెట్ నుండి బయటకు వెళ్తున్న సీన్ ఉన్నాయి. కాని వీడియోను క్షుణ్ణంగా చూడండి ఏముందో.

నిజానికి ఒక సాంగులో భాగంగా స్కార్లెట్ జుట్టును ఈ నటుడు పక్కకు తీస్తున్నప్పుడు.. ఆమె కొడుతుంది. అది పక్కా యాక్టింగ్ అని అక్కడ వీడియో చూస్తే తెలుస్తుంది. ఆ కొట్టే టైముకు చుట్టపక్కల ఉన్న డ్యాన్సర్లు కూడా రియాక్ట్ అవ్వాలి. వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. కొట్టేశాక స్కార్లెట్ మాత్రం.. ఇలా ఉంటే సరిపోద్దా ఇంకో టేక్ చేద్దామా అన్నట్లు రెడీగా ఉంటే.. సూటేసుకున్న ఒక వ్యక్తి వచ్చి సదరు ఉమాకాంత్ అనే నటుడితో గొడవపెట్టుకుని ఏదో వాగ్వివాదం చేస్తున్నాడు. ఉమాకాంత్ అక్కడ నుండి బయటకు వెళిపోతుంటే.. అతన్ని బతిమిలాలి మళ్ళీ సెట్లోకి తెచ్చారు. కట్ చేస్తే న్యూసులో మాత్రం.. అబ్బే ఉమాకాంత్ ను సెట్ నుండి మెడపట్టుకుని గెంటేశారు అని చెబుతున్నారు. మొత్తంగా వీడియో చూస్తే మీకేం అర్దమైంది?

చక్కగా ఈ సినిమా యునిట్ ఒక మాంచి ప్లాన్ వేసి.. ముందుగానే అందరూ ఎలా నటించాలో చెప్పి.. దానిని వీడియో తీయించి.. ఈ మొత్తం వీడియోకు ఇండియా అంతా వైరల్ గా కవరేజ్ వచ్చేలా చూసుకుని.. పనికిమాలిన పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారని అనిపించట్లేదూ? అనిపిస్తుంది.