మహేశ్… ఫస్ట్ లుక్ ఇలా ఉండటానికి రీజన్ వేరే ఉంది!

0mahesh-SPYDERమురుగుదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న ‘స్పైడర్’ సినిమా ఫస్ట్ లుక్ ఎట్టకేలకూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైటిల్ దగ్గర నుంచి చాన్నాళ్లుగా మిస్టరీగానే ఉండిపోయిన ఈ సినిమా కబురు ఎట్టకేలకూ వెలుగు చూసింది. మరి ఇలా విడుదల అయిన స్పైడర్ ఫస్ట్ లుక్ పై కొన్ని విమర్శలు అయితే తప్పడం లేదు. ప్రిన్స్ ఫ్యాన్స్ కు ఇది బాగానే నచ్చినా క్రిటిక్స్ మాత్రం విమర్శలు చేస్తున్నారు. కాని వారు.. ఇందులో ఏముంది అసలు? అని ప్రశ్నిస్తున్నారు.

మరి స్పైడర్ సినిమా ఫస్ట్ లుక్ ఇలా సాదాసీదాగా ఉండటం వెనుక చాలా కథే ఉన్నట్టుగా తెలుస్తోంది. సినిమా పై సాధ్యమైనంతగా అంచనాలను తగ్గిస్తూనే ఈ ఫస్ట్ లుక్ ను విడుదలచేశారని తెలుస్తోంది. సినిమాలకు ఇంతకు మించి చెప్పడానికి, ఫస్ట్ లుక్ గా విడుదల చేయడానికి ఇంకా చాలా గుజ్జు ఉందని.. అలాంటి వాటిని ఫస్ట్ లుక్ గా విడుదల చేస్తే.. సినిమా పై హైప్ పతాకస్థాయికి చేరుతుందని అది మహేశ్ కు ఇష్టం లేదని తెలుస్తోంది.

వీలైనంతగా అంచనాలను పెంచకుండా.. అండర్ డాగ్ గా వచ్చి హిట్ కొట్టాలనేది మహేశ్ అభిలాష. అందుకు అనుగుణంగానే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యిందనేది ఇన్ సైడర్ టాక్. ఇది అభిమానుల సినిమా మాత్రమే కాదు, అందరినీ ఆకట్టుకునే సినిమా అందుకే ఇలాంటి ఫస్ట్ లుక్ వచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.