బికినీ అందాలతో అవకాశాలు

0Seerat-Kapoor-Gets-Offer-in-Rana-And-Ravikanth-FIlmరన్ రాజా రన్ మూవీతో యాక్ట్రెస్ గా మారిపోయిన కొరియోగ్రాఫర్ సీరత్ కపూర్. అప్పట్లోనే ఓ హిందీ సినిమా చేసింది కానీ.. ఆ తర్వాత మాత్రం పూర్తిగా తెలుగు సినిమాలకే అంకితం అయిపోయింది. ఇన్నాళ్లు చిన్న సినిమాలతో నెట్టుకొచ్చిన సీరత్ కు.. రాజుగారి గది మూవీతో నాగార్జున.. సమంత వంటి స్టార్స్ తో కలిసి పని చేసే అవకాశం అందుకుంది.

ఈ మధ్య బికినీలతో బోలెడంత హంగామా చేసేస్తోంది సీరత్. గతంలోనూ గ్లామరసం పండించేది కానీ.. ఈ మధ్య డోస్ బాగా పెంచేసిందిలే. గ్లామర్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవాలంటే ఏం చేయాలనే విషయంపై బాగానే రీసెర్చ్ చేసినట్లుంది ఈ భామ. అమ్మడి ప్రయత్నాలు వృథా కాలేదు. ఇప్పుడీ చిన్నదానికి కొత్త ఛాన్స్ వచ్చి వాలింది. క్షణం దర్శకుడు రవికాంత్ పెరెపు తీయనున్న కొత్త సినిమాలో సీరత్ కపూర్ ను హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అగ్రిమెంట్ కూడా సైన్ చేయగా.. ఈ చిత్రానికి రానా దగ్గుబాటి నిర్మాత కావడం విశేషం.

ఈ మూవీలో పలువురు హీరోయిన్లు నటించనుండగా.. వాటిలో ఒక పాత్ర సీరత్ కు కట్టబెట్టారట. మిగిలిన పాత్రలకు సంబంధించిన డీటైల్స్.. త్వరలో అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్ర పోషించనున్నాడు.