ఇక సినిమాలు తీయలేం, అర్థం చేసుకోండి

0


Sekhar-Kammulaతెలంగాణ అమ్మాయి, అమెరికా అబ్బాయికి మధ్య పుట్టే ప్రేమకథా చిత్రం ‘ఫిదా’. వరుణ్, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జులై 21న విడుదలైంది. ఈ సినిమా విడుదలైన మరుసటి రోజే పైరసీ కావడంపై డైరెక్టర్ శేఖర్ కమ్ముల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

‘దయ చేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది కష్టపడితే ‘ఫిదా’ రూపొందింది. ఇలా కాపీలు (పైరసీ) చూస్తే మేము ఇలాంటి సినిమాలు ఇంకా చేయలేము…ప్లీజ్ కిల్ పైరసీ. కొంచెం గట్టిగా అనుకోకండి’ అంటూ శేఖర్ కమ్ముల తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశారు.