అన్నపూర్ణ ఇంట్లో పెను విషాదం!

0టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్నపూర్ణ కుమార్తె కీర్తి (23) శనివారం తెల్లవారుజామున ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య సమస్యల కారణంగానే కీర్తి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న బంజారా హిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కీర్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తన కూతురు హఠాన్మరణంతో అన్నపూర్ణమ్మ శోకసంద్రంలో మునిగిపోయారు. కీర్తి మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు వివరాలు వెల్లడించారు. అన్నపూర్ణకి పిల్లలు లేకపోవడంతో కీర్తిని 3 సంవత్సరాల క్రితం దత్తత తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌లోని ఎఫ్‌సీఐలో క్లర్క్‌గా పనిచేస్తున్న వెంకటకృష్ణ సాయితో కీర్తికి మూడేళ్ల క్రితం వివాహమైందని వారు చెప్పారు. ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలోని కృష్ణా బ్లాక్ లో కీర్తి నివాసం ఉంటున్నారు. అయితే కీర్తి కూతురుకు సరిగా మాటలు రాకపోవడంతో కొద్ది రోజులుగా స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నారు. అయితే పాపకు ఇకపై మాటలు రావని డిసూడ్ అయిన కీర్తి…ఢిఫ్రెషన్ లోకి వెళ్లారు. పాప కు ఏమీకాదని ధైర్యం చెప్పినా కీర్తి వినలేదు. ప్రస్తుతం కీర్తికి కౌన్సెలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉన్న వెంకటకృష్ణ…శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు కీర్తి ఇంటికి వచ్చారు. అయితే ఆ సమయంలో కీర్తి నిద్రపోతున్న కారణంతో ఆయన వేరే గదిలో పడుకొన్నారు. ఉదయం నిద్ర లేచేసరికి కీర్తి ఆత్మహత్య చేసుకున్నట్లు వెంకట కృష్ణ గుర్తించారు. దీంతో పక్కనే గోదావరి బ్లాక్ లో నివాసముంటోన్న అన్నపూర్ణకు ఆయన సమాచారమిచ్చారు. ఆ తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా కీర్తి ఆరోగ్యం సరిగా లేదని దానికి సంబంధించిన మందులు వాడుతోందని పోలీసులకు వెంకటకృష్ణ తెలిపారు.