సిగరెట్, డ్రింక్ కన్నా సెక్స్ బెటర్: ప్రియాంక

0


Priyanka-sexy-commentsహాలీవుడ్ లో సినిమా అనగానే పాపం చాలా ఆశలు పెట్టుకుంది ప్రియాంకా చోప్రా అయితే సినిమా అమెరికా లో రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే సినిమా ఒక ఎపిక్ ఫ్లాప్ అని తెలిసి పోయింది. పాపం పిగ్గమ్మ ఆసలన్నీ ఒక్కసారి గా కుప్ప కూలాయి. అయితే ప్రియాంకా నటనకు మాత్రం చెప్పుకోదగ్గ మార్కులే పడ్డాయి. సినిమాని ఏకి పారేసిన క్రిటిక్స్ మాత్రం ఇండియన్ బ్యూటీ ప్రియాంకా మాత్రం మంచి నటన కనబరిచిందంటూ మెచ్చుకున్నారు.

అమెరికన్ టీవీ చానెళ్ళ రియాలిటీ షోలలో ఒక ఇండియన్ నటిగా చిన్న చూపు చూడబడి అవమానాలనెదుర్కున్న ప్రియాంగా ఇప్పుడు వ్యూహం మార్చేసింది…, బీ ఎ రోమన్ వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ అన్నట్టు ఇప్పుడు పూర్తి స్థాయి హాలీవుడ్ నటిగా తనని తాను మార్చుకుంటోంది.

హాలీవుడ్‌లో అడుగుపెట్టగానే అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా అమెరికన్ యాక్సెంట్‌ను అలవరచుకున్న పిగ్గీ చాప్స్. ఈ మధ్య మాటల్లో అక్కడి వాతావరణానికి తగ్గట్టే బోల్డ్ డోస్‌ను కూడా పెంచేసింది. నిన్నా మొన్నటి వరకూ బయట సెక్స్ అన్న మాట పలకటమే ఇబ్బంది కరం అన్నట్టు ఉన్న ప్రియాంక పద్దతి మార్చేసింది.

అక్కడివారు శృంగారం సహా అన్ని విషయాల్లోనూ ఎటువంటి దాపరికం లేకుండా మాట్లాడుకున్నట్లే ఇప్పుడు ప్రియాంక కూడా నిర్మొహమాటంగా… ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ దగ్గరనుంచి. సెక్స్ వరకూ అన్నీ పబ్లిక్ ప్లాట్ ఫారం మీద చర్చలు కూడా చేసేస్తోంది. ప్రియాంక తొలి హాలీవుడ్ మూవీ ‘బేవాచ్’ విడుదలైన సందర్భంగా పలు టాక్ షోల్లో పార్టిసిపేట్ చేస్తూ బిజీబిజీ గా ఉన్న ప్రియాంకా చోప్రా, ఇందులో భాగంగానే ఓ బోల్డ్ కార్యక్రమంలో పాల్గొంది.

అక్కడ ఎంతో చక్కగా సెక్స్ గురించి చెప్పుకొచ్చింది. అందులో తప్పులేదని.. అది ప్రకృతి సిద్ధమైనదేనని కాబట్టి తాను దాన్ని తప్పుగా భావించనని చెప్పింది. అంతేకాదు… మరిత బోల్డ్ గా సిగరెట్ తాగడం, డ్రింక్ చేయడం కన్నా శృంగారమే బెటర్ అని బాలీవుడ్ వాతావరణానికి ఎంతో దూరం జరిగినట్టు స్పష్టం చేసి మనోళ్ళ తో నోళ్ళు వెళ్ళబెట్టించింది.

హాలీవుడ్‌లో సస్టైయిన్ అవ్వాలంటే ఆ మాత్రం తెగింపు తప్పదనుకుందో ఏమో., మరీ చొరవగా మాట్లాడుతోంది, మామూలుగా ఉంటే అక్కడ నడవదని అనిపించిందో లేక ఇన భవిశ్యత్ హాలీవుడ్ లోనే కాబట్టి పూర్తిగా హాలీవుడ్ గర్ల్ లా మేక్ ఓవర్ అయ్యే పనిలో పడినట్టుంది . ఇంతా చేస్తే అమ్మడి సినిమాకు రేటింగ్ మాత్రం 1/5 రావటం గమనార్హం… మరి పిగ్గీచాప్స్ ఇప్పుడేం చేస్తుందో చూడాలి…