షేడ్స్ ఆఫ్ ‘సాహో’ చాప్టర్ 1 ఎలా ఉందంటే..!

0

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘సాహో’ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి వంటి చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంచనాలకు తగ్గకుండా సుజీత్ బాలీవుడ్ రేంజ్ లో హాలీవుడ్ తరహా యాక్షన్ సీన్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది. అంతా ఆశించినట్లుగానే అంచనాలు పెట్టుకున్నట్లుగానే ఈ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని తాజాగా ప్రభాస్ బర్త్ డే సందర్బంగా విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 ను చూస్తుంటే అనిపిస్తుంది.

భారీ యాక్షన్ ఎపిసోడ్ కు సంబంధించిన మేకింగ్ ను చాప్టర్ 1 లో చూపించడంతో పాటు – ప్రభాస్ వెరీ స్టైలిష్ లుక్ ను రివీల్ చేయడం జరిగింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యేలా ఈ చాప్టర్ 1 వీడియో ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక హాలీవుడ్ మూవీ రేంజ్ లో యాక్షన్ సీన్ ను తెరకెక్కిస్తున్న మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇది ఖచ్చితంగా ప్రభాస్ బర్త్ డేకు ఫ్యాన్స్ కు మంచి గిఫ్ట్ అంటూ సినీ వర్గాల వారు కూడా అంటున్నారు. చాప్టర్ 2 లో ఏం చూపిస్తారా అంటూ అప్పుడే చర్చ మొదలైంది.

ఇక షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 అంటూ విడుదలైన వీడియోను విడుదల చేయడంతో ‘బాహుబలి’ సినిమాకు అనుసరించిన ప్రమోషన్స్ ప్లాన్స్ ను సాహో కు కూడా అనుసరిస్తున్నట్లుగా అనిపిస్తుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ‘బాహుబలి’ చిత్రం విడుదలకు ముందు ఒక్కో పాత్రకు సంబంధించిన పోస్టర్ – మరియు మేకింగ్ వీడియోలను విడుదల చేయడం జరగింది. ఇప్పుడు చాప్టర్స్ పేరుతో సాహో టీం కూడా మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేయాలని భావిస్తున్నట్లుగా సోషల్ జనాలు చర్చించుకుంటున్నారు. ఎలా ప్రమోషన్ చేస్తే ఏం సినిమా బాహుబలి స్థాయిలో కాకున్నా కాస్త అటు ఇటుగా ఆ స్థాయిలో ఉంటే ఫ్యాన్స్ కు అంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి.
Please Read Disclaimer