పైరసీ : ఇంటర్ నెట్ లో ట్యూబ్ లైట్

0salman-srk-tubeliteసినిమా పరిశ్రమకు క్యాన్సర్ లా మారింది పైరసీ. చిన్నాపెద్దా సినిమా అనే తేడా లేకుండా అన్ని సినిమాలూ పైరసీ దెబ్బకు వణుకుతున్నాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ సినిమా పైరసీ బారిన పడింది.

‘ట్యూబ్‌లైట్‌’చిత్రం రేపు విడుదల అవుతుందనగా ఈరోజు సినిమాలోని కొన్ని సన్నివేశాలు లీకయ్యాయి. అందులోనూ లీకైనవి షారుక్‌ ఖాన్‌ నటించిన సన్నివేశాలు. షారుక్‌,సల్మాన్‌ని తెరపై మరోసారి ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురు చూశారు. అలాగే షారుక్‌ పాత్రతో ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేయాలనుకున్న చిత్రబృందం కు పెద్ద నిరాస మిగిలింది. ట్యూబ్ లైట్ లో షారుక్ ఖాన్ మేటర్ ని చాలా గోప్యంగా వుంచారు. కానీ పైరసీ నేరగాళ్ళు నీరు కార్చేశారు.