అంతా అబద్ధమే.. షారుక్ ఏం చేయలేదు

0బాలీవుడ్ లో స్టార్ హీరోలతో స్నేహం అంటే మాములు విషయం కాదు. వారితో సాన్నిహిత్యంగా ఉండాలంటే చాలా స్పెషల్ అయ్యి ఉండాలి. అక్కడ ఖాన్ ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అందరికి తెలిసిందే. సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ షారుక్ ఖాన్ .. ఇలా ఖాన్ త్రయం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇకపోతే షారుక్ కి కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు. కెరీర్ మొదట్లో కష్టాలు ఎదుర్కొన్న షారుక్ అప్పట్లో కలిసున్న వారిని బాగా గుర్తుంచుకుంటాడు.

ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తరువాత షారుక్ కి దగ్గరగా అయిన నటుడు ఇర్ఫాన్ ఖాన్. వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్.. బాలీవుడ్ లో ఎవరిని అడిగిన వీరి గురించి చెబుతారు. ఇకపోతే మార్చ్ లో ఇర్ఫాన్ ఖాన్ తన అరుదైన అనారోగ్యం గురించి ఒక షాకింగ్ నిజాన్ని చెప్పిన సంగతి తెలిసిందే. చాలా మంది అభిమానులను ఒక్కసారిగా ఆ విషయం ఆశ్చర్యపరిచింది. షారుక్ కూడా స్నేహితుడి గురించి తెలుసుకొని ఎంతో బాధ పడ్డాడు. అయితే ఎందుకో గాని ఇటీవల వచ్చిన ఒక రూమర్ బాగా వైరల్ అయ్యింది. ఎప్పటికప్పుడు ఇర్ఫాన్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ ఉన్నాడని వారి ఫ్యామిలీ తో అలాగే ఇర్ఫాన్ భార్య తో కూడా మాట్లాడుతున్నాడని టాక్ వచ్చింది.

అంతే కాకుండా రీసెంట్ గా ట్రీట్మెంట్ కోసం ఇర్ఫాన్ లండన్ వెళుతున్నాడని తెలిసి షారుక్ ముంబై ఎయిర్ పోర్ట్ లో స్పెషల్ గా కలుసుకున్నాడు అని రకరకాలుగా రూమర్స్ వచ్చాయి. చివరికి లండన్ లోని తన సొంత ఫ్లాట్ తాళాలు ఇచ్చి అక్కడే రెస్ట్ తీసుకొమ్మని షారుక్ చెప్పాడని కూడా ఓ మీడియా బాగా ప్రచారం చేసింది. అయితే ఫైనల్ గా అది అబద్ధం అని తెలిసింది. షారుక్ కి ఇర్ఫాన్ ఖాన్ కి స్నేహం ఉన్న మాట వాస్తవమే కానీ ఇటీవల వచ్చిన రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు. ఇర్ఫాన్ ఖాన్ హాలీవుడ్ రేంజ్ యాక్టర్. ఆయన గురించి దేశ విదేషాల్లో చాలా మంది ప్రముఖులకు తెలుసు. ఆయనకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి లండన్ వైద్యులు ఇప్పటికే అంతా సిద్ధం చేశారు.