షారుఖ్ ఒక్క పైసా తీసుకోలేదు..:కమల్

0బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు – మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కు మధ్య ఓ పోలిక ఉందని సినీ జనాలు చెబుతుంటారు.. షారుఖ్ డబ్బు కోసం చెత్త సినిమాలు కూడా చేస్తుంటాడని.. కమర్షియల్ కోణంలో తనకు ఎంత వస్తుందని ఆలోచిస్తాడు తప్పితే సినిమాల్లో సామాజిక సేవ గురించి అస్సలు టచ్ చేయడని విమర్శిస్తుంటారు..

అదే అమీర్ ఖాన్ మాత్రం సినిమాల ద్వారా బాగా డబ్బు సంపాదిస్తూనే.. అదే సమయంలో తన సినిమాలకు కథగా సామాజిక అంశాన్నే తీసుకొని హిట్ కొడుతుంటాడని చెబుతుంటారు. షారుఖ్ నుంచి ఇప్పటివరకూ ఒక్క సామాజిక సమస్య మీద సినిమా రాలేదని.. ఆయనో డబ్బు మనిషి అని ఆడిపోసుకుంటారు..

కానీ షారుఖ్ ఖాన్ గురించి తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా కమల్ తన ‘విశ్వరూపం2’ మూవీని హిందీలో విడుదల చేశారు. ఇందులో భాగంగా ఓ హిందీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో షారుఖ్ డబ్బు మనిషి అన్న దానిపై వివరణ ఇచ్చాడు.. ‘తాను స్వీయ దర్శకత్వంలో తీసిన హేరామ్ అనే సినిమాలో షారుఖ్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఆ పాత్ర కోసం షారుఖ్ ఒక్క పైసా కూడా తీసుకోలేదు. తనతో నటించాలన్న కోరికతోనే షారుఖ్ అలా చేశాడని తెలిసింది. బడ్జెట్ పెరిగిపోయిందని తెలిసి షారుక్ అడగలేదు. అందుకే సినిమా విడుదలయ్యాక హిందీ హక్కులు మొత్తం షారుఖ్ కు రాసిచ్చానని’ కమల్ చెప్పుకొచ్చాడు. షారుఖ్ డబ్బు మనిషి కాదనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అని కమల్ చెప్పుకొచ్చాడు.