మరణం అంచుల దాకా షారుక్..యాంకర్‌పై బాలీవుడ్ బాద్షా దాడి!

0


Shah-rukh-khan-the-ramez-gaబాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ దాదాపు మరణం అంచుల దాకా వెళ్లి వచ్చాడు. దుబాయ్ ఎడారి ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఇసుక బురదలో కూరుకుపోయింది. ఈ ఘటనలో తనను తాను కాపాడుకుంటూనే ఇసుక ఊబిలో నుంచి తనతోపాటు ప్రయాణిస్తున్న ఇద్దరిని కాపాడేందుకు ప్రయత్నించాడు. అంతలోనే డైనోసార్ వారి వద్దకు వచ్చింది. అప్పటికే పీకల్లోతు ప్రమాదంలో కూరుకుపోయిన వారికి ఇక ప్రాణాలు దక్కవని అనిపించింది.

దేవుడిపైనే ఇక భారం వేశారు. అంతలోనే డైనోసార్ ముసుగు నుంచి ఓ వ్యక్తి బయటకు వచ్చి ఇది రియాల్టీ గేమ్ షో అని నిర్వాహకుడు రమేజ్ గలాల్ చెప్పడంతో ఈ కథ సుఖాంతం అయింది. ఆ తర్వాత ఆగ్రహంతో యాంకర్‌ను షారుక్ పిడిగుద్దులు గుద్దాడు. ఈజిప్టు కమెడియన్ రమేజ్ ఈ షోను నిర్వహిస్తున్నాడు.

అప్పటికే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్న షారుక్ చాలా భయంకరంగా ఉన్న రియాల్టీ షో నడిపే తీరుపై మండిపడ్డారు. ఇలాంటి చెత్త షోలో పాల్గొనేందుకు మమ్మల్ని ఇండియా నుంచి ఇక్కడకు పిలిపించారా అంటూ యాంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నానా రకాలుగా బూతులు తిట్టాడు. కొద్ది నిమిషాలపాటు షారుక్ అర్థం కాలేదు.

రియాల్టీ గేమ్‌లో షారుక్‌ను ఇబ్బందికి గురిచేసినందుకు నిర్వాహకుడు రమేజ్ గలాల్ సారీ చెప్పాడు. కడుపులో తల పెట్టి క్షమాపణ కోరాడు. అయితే ఆ భయంకరమైన ఎపిసోడ్ నుంచి ఇంకా బయటపడని షారుక్.. యాంకర్ రమేజ్‌ను దూషించాడు. ఇంకా నా కళ్ల ముందే ఉంటే నేను ఏమి చేస్తానో నాకే తెలియదు. నీవు బతికి ఉండాలని కోరుకొంటే నా కళ్ల ముందు కనిపించకు అని హెచ్చరించాడు.

అయినా రమేజ్ గలాల్ పట్టువదలకుండా నేను ఫ్యాన్‌ను. ఐ లవ్‌ యూ అంటూ వెంటపడ్డాడు. ఆ క్రమంలో తనను వదలని రమేజ్‌ను కింద పడేసి షారుక్ పిడిగుద్దులు గుద్దాడు. ఆగ్రహంతో తన కోసం కేటాయించిన వాహనంలోకి ఎక్కాడు. అయితే నన్ను క్షమిస్తేనే ఇక్కడ నుంచి పంపిస్తానని రమేజ్ వెంటపడ్డాడు. అయినా షారుక్ శాంతించలేదు. వాహనంలో షారుక్ ముందుకు సాగుతుండగా రమేజ్ అడ్డుపడ్డాడు.

తనను క్షమించకుండా అక్కడి నుంచి పంపించేది లేదని భావించిన రమేజ్ గలాల్.. షారుక్‌ను ప్రసన్నం చేసుకొనేందుకు మళ్లీ ప్రయత్నించాడు. షారుక్ నటించిన బిల్లూ సినిమాలోని మర్జానీ మర్జానీ పాటను హమ్ చేయడంతో షారుక్ శాంతించాడు. నవ్వులు చిందిస్తూ షారుక్ కోపంగానే రమేజ్ గలాల్‌ను క్షమిస్తున్నట్టు సైగ చేశాడు. దాంతో రమేజ్ గలాల్ ఆనందంతో చిందులేశాడు.

దుబాయ్‌లో రమేజ్ గలాల్ నిర్వహించే ఈ రియాల్టీ షో చాలా పాపులర్. ఇప్పటికే చాలా మంది హాలీవుడ్, ఇతర ప్రముఖులు ఈ షోలో పాల్గొన్నారు. తాజాగా అరబిక్ టీవీ నిర్వహించే ఈ కార్యక్రమంలో షారుక్ పాల్గొన్న ఎపిసోడ్ చాలా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ రియాల్టీ షోకు సంబంధించిన రెండు నిమిషాల వీడియో ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా మారాయి.