ప్రభాస్ పై షాహిద్ షాకింగ్ కామెంట్

0

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అర్జున్ రెడ్డి` ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కబీర్ సింగ్ అనేది టైటిల్. దేవరకొండ పోషించిన రౌడీ డాక్టర్ పాత్రలో షాహిద్ పరకాయ ప్రవేశం చేస్తున్నారని ఇటీవల రిలీజైన టీజర్ పోస్టర్లు రివీల్ చేశాయి. ఈ టీజర్ కి డార్లింగ్ ప్రభాస్ అంతటివాడే కాంప్లిమెంట్లు ఇచ్చారు. తెలుగు వెర్షన్ టీజర్ ని మించి ఆకట్టుకుందని ప్రభాస్ ప్రశంసలు కురిపించారు. షాహిద్ కి ఫోన్ చేసి 7 నిమిషాల పాటు ప్రభాస్ మాట్లాడారని అతడి వ్యక్తిగత హెయిర్ డిజైనర్ తెలిపారు.

తాజాగా ప్రభాస్ గురించి షాహిద్ ఓ అవార్డుల కార్యక్రమంలో స్పందించారు. “ప్రభాస్ తో నేను మాట్లాడాను. అతడి మనసు వెన్న లాంటిది. ఎంతో మృధు స్వభావి. ప్రభాస్ మనకు మహేంద్ర బాహుబలి. తన నుంచి వచ్చిన ప్రశంసలు ఎంతో కూల్ గా.. ప్రోత్సాహకంగా ఉన్నాయి. అర్జున్ రెడ్డి చిత్రం గురించి హిందీ ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. తెలుగులో ఐకానిక్ చిత్రమిది. అక్కడ ప్రేక్షకులు గొప్పగా ప్రేమించి ఆదరించారు“ అని అన్నారు.

కబీర్ సింగ్ ట్రైలర్ మే రెండో వారంలో రిలీజ్ కానుందని.. జూన్ 21న సినిమాని రిలీజ్ చేస్తున్నామని షాహిద్ వెల్లడించారు. అర్జున్ రెడ్డి సినిమా ఇతివృత్తాన్ని ఎక్కడా మార్చకుండా కేవలం ప్రాంతీయ నేపథ్యాన్ని మార్చామని తెలిపారు. కథను ముంబై- దిల్లీకి షిఫ్ట్ చేశామని అన్నారు. జియో స్పా గ్లోబల్ స్పా ఇండియా అవార్డ్స్ కార్యక్రమంలో షాహిద్ కపూర్ పైవిధంగా స్పందించారు. ఇంత పెద్ద ఈవెంట్ లో షాహిద్ అంతటి స్టార్ ప్రభాస్ గురించిన ప్రస్థావన తేవడం ఆసక్తికరం. గతంలో నేను చేసిన పొరపాట్ల గురించి అభిమానులు వేలెత్తి చూపారు. ఈసారి అలాంటి పొరపాటు చేయడం లేదని.. `కబీర్ సింగ్` చిత్రం తనకు ఎంతో ఇంపార్టెంట్ అని షాహిద్ ఈ సందర్భంగా అన్నారు. సినిమా రిలీజ్ కి నెలరోజుల ముందు ట్రైలర్ ని రిలీజ్ చేయడం సరైన విధానం అని షాహిద్ వ్యాఖ్యానించారు. అతడి మాటల్ని బట్టి.. కబీర్ సింగ్ పై ప్రభాస్ కాంప్లిమెంట్ బాలీవుడ్ లో ప్రచారానికి బాగానే కలిసొస్తుందన్నమాట. అర్జున్ రెడ్డి తెలుగులో గొప్ప సినిమా అని ఉత్తరాది వారికి పూర్తిగా తెలీదు.. అమరేంద్ర బాహుబలి ప్రచారం వల్ల జనాలకు కనెక్టవుతుందని షాహిద్ నమ్మకం వ్యక్తం చేయడం ఆసక్తికరం. దీనిని బట్టి హిందీ ఆడియెన్ లో ప్రభాస్ కి ఎంతటి క్రేజు ఉందో మరోసారి అతడి మాటల రూపంలో ప్రూవైంది.
Please Read Disclaimer