స్టార్ హీరోకు హ్యాకర్ల షాక్!

0విశాల్ ‘అభిమన్యుడు’ సినిమాను ఎంతమంది చూసి ఉంటారో తెలీదు కానీ మనందరం రెగ్యులర్ గా మునిగి తేలుతున్న సోషల్ మీడియా సముద్రంలో మన డేటా ను ఎంత సులువుగా కొట్టేసి మనల్ని రోడ్డుమీదకు లాగొచ్చనే విషయం క్లియర్ గా చూపించారు. నిజానికి ఆ సినిమాలో చూపించింది గోరంత.. యూట్యూబ్ లో ఉన్న ‘డార్క్ నెట్’ ను గురించి వివరించే కొన్ని వీడియోలు.. ఇతర సైబర్ క్రైమ్ వీడియో లు చూస్తే మన మతి పోతుందంతే.

అదంతా డీప్ సబ్జెక్ట్.. ఇక అలాంటివాటికి శాంపిల్ అన్నట్టుగా రాబోయే కాలంలో బాలీవుడ్ కు కాబోయే ‘అర్జున్ రెడ్డి’ షాహిద్ కపూర్ ట్విట్టర్ ఇన్స్టా గ్రామ్ ఖాతాలను హ్యాక్ చేసి హంగామా సృష్టించారు. షాహిద్ ఖాతా నుడి కత్రినా కు ‘ఐ లవ్ యూ’ చెప్పారు. డోనాల్డ్ ట్రంప్ వీడియో ఒకటి పోస్ట్ చేసి ‘మనం గెలుస్తాం’ అన్నారు. ఇక ఈ హంగామా సంగతి తెలిసిన తర్వాత షాహిద్ సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేశాడు.

ఇక ఫైనల్ గా ఈరోజు తన ట్విట్టర్ ఖాతా మళ్ళీ స్వాధీనం లోకి వచ్చింది. ఈ విషయం గురించి స్పందించిన షాహిద్ “హాయ్ గైస్.. ఫైనల్ గా ట్విట్టర్ లోకి మళ్ళీ వచ్చాను. నిజమే నా ఖాతా హ్యాక్ అయింది. దయచేసి గత 24 గంటలుగా నా ట్విట్టర్ హ్యాండిల్ నుండి వచ్చిన కమ్యూనికేషన్ ను పట్టించుకోవద్దు” అన్నాడు.

ఇక హంగామా పూర్తయింది కదా. ఫ్యాన్స్ కు ఒక స్వీట్ న్యూస్ చెప్పాడు. షాహిద్ కు మొదట ఒక పాప.. పేరు మిషా. రీసెంట్ గా బాబు పుట్టాడు. ఆ బాబుకు జైన్ కపూర్ అని పేరు పెట్టామని.. బాబు రాకతో మేమ సంతోషంగా ఉన్నామని తెలిపాడు. తమకు విషెస్ తెలిపిన వారికి.. బ్లెస్సింగ్స్ ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పాడు.