షారుక్ ఖాన్ ఫ్యామిలీలో విషాద ఘటన..

0shahrukh-khan-familyబాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుటుంబంలో స్వల్ప విషాదం చోటుచేసుకొన్నాడు. షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆర్యన్‌కు సర్జరీ అనివార్యమైంది. దీంతో ఐఫా అవార్డులకు బాలీవుడ్ బాద్షా దూరమయ్యాడు. వివరాల్లోకి వెళితే..

షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ స్కూల్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా తీవ్రంగా గాయపడ్డాడు. అతడి ముక్కుకు గాయం కావడంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. తక్షణమే వైద్యులు చికిత్స అందించడంతో పెద్ద ముప్పు తప్పింది.

అతనికి సర్జరీ చేయాల్సి ఉంటుంది అని షారుక్‌కు వైద్యులు వెల్లడించినట్టు సమాచారం. దాంతో ఐఫా అవార్డుల కార్యక్రమాన్ని రద్దు చేసుకొన్నారు.

ప్రస్తుతం ఆర్యన్ ఖాన్‌ పరిస్థితి మెరుగుపడినట్టు తెలుస్తున్నది. గాయం నుంచి కోలుకొని మాములు స్థితికి చేరుకొన్నట్టు సమాచారం. ప్రస్తుతం వైద్యం కొనసాగుతుందని, త్వరలోనే సర్జరీ నిర్వహిస్తామని వైద్యులు పేర్కొన్నారు.

విదేశంలో నిర్వహించే సర్జరీ కోసం షారుక్ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగా వ్యక్తిగత పర్యటనను రద్దు చేసుకొన్నట్టు తెలుస్తున్నది. ఆర్యన్‌కు జరిగిన ప్రమాదం గురించి షారుక్ తీవ్ర ఆందోళనకు గురైనట్టు తెలుస్తున్నది.

ఈ క్రమంలోనే ప్రతిష్ఠాత్మకంగా జరిగే అవార్డుల కార్యక్రమానికి వ్యక్తిగత కారణాలతో గతేడాది కూడా షారుక్ ఖాన్ దూరమయ్యాడు. వచ్చే జూలైలో జరిగే ఐఫా అవార్డులకు కూడా గైర్హాజరు కానున్నడనే వార్త బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రస్తుతం షారుక్ ఖాన్ దర్శకుడు ఇంతియాజ్ అలీ రూపొందించే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల ఆ చిత్రానికి జబ్ హ్యారీ మెట్ సెజల్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 80 దశకనాటి వాతావరణ పరిస్థితుల్లో సాగే రొమాంటిక్, కామెడీ చిత్రంగా తెరకెక్కుతున్నది. అనుష్క శర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రాగ్, అమ్‌స్టర్ డామ్, లిబ్సన్, బుడాపెస్ట్ తదితర నగరాల్లో షూట్ చేశారు.