పబ్లిసిటీ కోసం షారుఖ్ ని వాడేస్తున్నారు

0

ఏదైనా సినిమాకు హైప్ తేవాలన్నా పబ్లిసిటీ చేసుకోవాలన్నా తమిళ తంబీల స్టైలే వేరు. అందుకే రొటీన్ మాస్ మాసాలాలు ఎన్ని చేసినా అక్కడి స్టార్ హీరోలు వందల కోట్ల వసూళ్లు చాలా తేలిగ్గా తెచ్చేసుకుంటారు. తాజాగా విజయ్ హీరోగా రాజు రాణి-తేరి ఫేం ఆట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ గురించి అలాంటి ప్రచారమే జరుగుతోంది. దాని ప్రకారం ఇందులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నట్టు వాటి సారాంశం.

సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ కు ముందు జరిగే ఎపిసోడ్ లో ఈ పాత్ర ఎంటరవుతుందని పదిహేను నిముషాలు రచ్చ చేసాక ఆ తర్వాత మిగలిన కథ కంటిన్యూ అవుతుందని చెబుతున్నారు. న్యూస్ ఇలా క్రియేట్ కావడానికి కారణం ఉంది. కొద్దిరోజుల క్రితం ఐపిఎల్ మ్యాచ్ కోసం షారుఖ్ చెన్నై వచ్చినప్పుడు ఆట్లీ వెళ్లి కలిశాడు. ఇది దాని గురించే అని లింక్ పెడుతున్నారు

నిజానికి షారుఖ్ ఖాన్ కు సౌత్ సినిమాలపై ఎప్పుడూ ఆసక్తి లేదు. క్యామియోలకు అసలే నో చెబుతాడు. రజనీకాంత్ అంతటి స్టార్ తన రావన్ లో చిన్న సీన్ లో కనిపించినా తాను మాత్రం ఎవరు అడిగినా ఇప్పటిదాకా నో చెబుతూనే వచ్చాడు. క్యామియోలను కేవలం బాలీవుడ్ కు మాత్రమే పరిమితం చేసుకున్నాడు.

అలాంటిది ఉన్నట్టుండి విజయ్ కు ఎస్ చెబుతాడు అంటే నమ్మడానికి లేదు. పైగా జీరో దెబ్బకు షారుఖ్ బాగా డిస్ట్రబ్ గా ఉన్నాడు. అందుకే కొత్త సినిమా ఒప్పుకోకుండా నాలుగు నెలల నుంచి ఖాళీగా టైం పాస్ చేస్తున్నాడు. సో విజయ్ సినిమా రోల్ గురించిన వార్త నిరాధారమే అనుకోవాలి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు
Please Read Disclaimer