శైలజరెడ్డి అల్లుడు రేట్ అదిరిందిగా

0ఇప్పుడున్న యూత్ హీరోస్ లో ఫుల్ జోష్ మీదున్న హీరో ఎవరయ్యా అంటే నాగ చైతన్యే. ఏ హీరోని తీసుకున్నా ఏడాదికి ఒక్క సినిమా లేదా రెండు చేయడానికి ఆపసోపాలు పడుతుంటే చైతు మాత్రం ఒకేసారి ఐదు సినిమాలు లైన్ లో పెట్టేసి శబాష్ అనిపిస్తున్నాడు. సవ్యసాచి విడుదలకు సిద్ధమవుతుండగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న శైలజారెడ్డి అల్లుడు బిజినెస్ స్టేజిలోనే సంచలనం రేపుతోంది. తెలుగు రాష్ట్రాలు కాకుండా రెస్ట్ అఫ్ ఇండియా-శాటిలైట్-డిజిటల్ హక్కులు కలిపి మొత్తం 14 కోట్ల దాకా నిర్మాత జేబుల్లోకి వెళ్లేలా చేసాడట ఈ అల్లుడు. రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం కలుపుకుంటే పెట్టిన పెట్టుబడితో పాటు లాభాలు కూడా విడుదలకు ముందే కళ్ళజూసే అవకాశాలు ఉన్నాయి. ఎలా చూసుకున్నా ఇది చాలా మంచి డీల్ అని చెప్పొచ్చు. ఆన్ లైన్ లో బాగా సుపరిచితంగా ఉండే ఐ డ్రీం మీడియా ఈ హక్కులను కొనుగోలు చేసినట్టు తెలిసింది.

మారుతీ ఫుల్ స్వింగ్ లో దీని షూటింగ్ జరుపుతున్నాడు. కీలకమైన కొంత టాకీ పార్ట్ తో సహా జానీ మాస్టర్ నేతృత్యంలో రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసాడు. అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో చైతుకి అత్తయ్యగా రమ్యకృష్ణ నటించడం మరో ఆకర్షణ. నాగార్జున అల్లరి అల్లుడు తరహాలో ఫుల్ మాస్ ఎంటర్ టైన్మెంట్ తో ఓ రేంజ్ లో ఉంటుందని ఫాన్స్ అంచనాలు పెట్టేసుకున్నారు. అత్త అల్లుడు ఫార్ములా సరిగ్గా చూపిస్తే కనక కాసుల వర్షం కురిపిస్తుందని అందరి హీరోల విషయంలో రుజువైనదే. సో మారుతీ లాంటి పల్స్ తెలిసిన దర్శకుడు తోడయ్యాడు అంటే ఇక చెప్పేదేముంటుంది. లాస్ట్ ఇయర్ మహానుభావుడుతో మంచి హిట్ కొట్టిన మారుతి శైలజారెడ్డి అల్లుడుతో ఇంకా పెద్ద సక్సెస్ ఆశిస్తున్నాడు. ప్రీ టాక్ తో పాటు జరుగుతున్న బిజినెస్ చూస్తుంటే నమ్మకం నిలబడేలా ఉంది.