శంకర్ కామెడీ హీరో అనిపించుకున్నాడుగా

0కథానాయకుడు అంటే అన్ని అంశాల్లో రాటు దేలి ఉండాలని ఏమి లేదు. డ్యాన్స్ – ఫైట్స్ అని కాకుండా యాక్టింగ్ లో మెప్పించగలిగితే చాలా వరకు హీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. గత కొంత కాలంగా టాలీవుడ్ లో చాలా మంది కమెడియన్స్ హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే అందులో చాలా వరకు అందరూ సక్సెస్ అవ్వడం లేదు. కొన్ని రోజుల వరకు బాగానే నెట్టుకొస్తున్నా కూడా ఆ తరువాత గతంలో వచ్చిన ఇమేజ్ ను కూడా పోగొట్టుకుంటున్నారు.

అసలు విషయంలోకి వస్తే.. ఇప్పుడు షకలక శంకర్ కూడా హీరోగా ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా శంభో శంకర్ శుక్రవారం విడుదలైంది. ట్రైలర్ తోనే ఆకట్టుకున్న కమెడియన్ తెరపై పర్ఫెక్ట్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడని చెప్పాలి. కామెడీ సన్నివేశాల్లో అనే కాకుండా ఒక మాస్ యాక్షన్ హీరో ఇచ్చే పర్ఫామెన్స్ ను కరెక్ట్ గా ఇచ్చాడు. సినిమా పర్వాలేదు అనిపించుకుంది. శంకర్ కామెడీ హీరో గా మెప్పించాడు. శంభో శంకర సినిమాలో శంకర్ బావున్నాడు. అని టాక్ వస్తోంది.

మొత్తానికి మొదటి సినిమాతో హీరోగా మంచి మార్కులు అందుకున్న శంకర్ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అయితే డ్రైవర్ రాముడు అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఆ సినిమా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. చుస్తే అందులో కూడా మంచి ఎనర్జీతో పర్ఫామెన్స్ చూపించేలా ఉన్నాడు అని అర్ధమవుతోంది. ఒక సినిమా విడుదల కాకముందే మరో అవకాశం అందుకున్న శంకర్ నెక్స్ట్ కూడా అదే తరహాలో ప్రశంసలు అందుకుంటాడో లేదో చూడాలి.