శంకర్ రెమ్యునరేషన్ లెక్కలు విన్నారా!!

0అదృష్టం అనేది ఎలా ఉంటుందో సినిమా ఇండస్ట్రీలో కొంత మంది నటీనటులను చూస్తే పర్ఫెక్ట్ గా అర్ధమవుతుంది. అలాగే కష్టం.. ఓర్పు.. పట్టుదల కూడా సినిమా వారి జీవితాల్లో చాలా ఉంటాయి. ఇండస్ట్రీలో అడుగుపెట్టగానే వాటి డోస్ మాములుగా ఉండదు. తట్టుకున్నోడే పైకి ఎదుగుతాడు. అలాంటి వారిలో షకలక శంకర్ బాకా క్లిక్ అయ్యాడు.

జబర్దస్త్ నుంచి సినిమాల్లో కమెడియన్ వరకు వచ్చిన అతను మంచి క్రేజ్ అందుకొని అతి తక్కువ కాలంలోనే మంచి రెమ్యునరేషన్ అందుకోగలిగాడు. ప్రస్తుతం హీరోగా ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో శంకర్
ఆనందో బ్రహ్మ – గీతాంజలి – రాజుగారి గది వంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ తో క్రేజ్ తెచ్చుకున్నాడు. రోజుకి 30 – 40 వేలు తీసుకునేవాడట. అయితే ఇప్పుడు హీరోగా చేసిన శంభో శంకర సినిమాకు 50 రోజుల కాల్షీట్స్ ఇచ్చాడట. మరి ఈ సినిమాకు మొత్తం రెమ్యునరేషన్ గట్టిగానే అంది ఉంటుంది అని ఒక ఆలోచన రావచ్చు.

కానీ ఈ యాక్టర్ మాత్రం ఈ సినిమాకు రోజుకు సగటున 13 వేలు మాత్రమే తీసుకున్నాడట. అందుకు ఒక కారణం ఉందని శంకర్ వివరణ ఇచ్చాడు. ఈ సినిమాకు వచ్చిన మొత్తం తక్కువే అయినా మనస్ఫూర్తిగా పనిచేశాను. రోజు బిర్యానీ తినగలమా.. అలాగని నచ్చనిది తినలేము. నచ్చిందే తింటాం. ఆ విధంగా ఆలోచించి నాకు నచ్చని సినిమాలు వదిలేసి నచ్చిన సినిమా చేశాను. అంతే గాని ఏదో ఉద్దరించేద్దామని హీరో అయిపోలేదు అని తన భావనను వ్యక్తపరిచాడు శంకర్.