ఇది షకీలా మసాలా

0

ఈ జనరేషన్ ప్రేక్షకులకు కొంతమందికి షకీలాపేరు తెలియకపోవచ్చుగానీ ఓ పది పదిహేనేళ్ళ క్రితం షకీలా పేరు చెప్తే ఎవరైనా అలా షేక్ అయ్యవాళ్ళు. షకీలా అడల్ట్ సినిమాల దెబ్బకు ఓ దశలో మలయాళం సూపర్ స్టార్లు తమ సినిమాల రిలీజ్ డేట్ జాగ్రత్తగా .. షకీలా తో పోటీ లేకుండా ఎంపిక సుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అదే షకీలా బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘షకీలా’ టైటిల్ తో ‘నాట్ ఎ పోర్న్ స్టార్’ అనే క్యాప్షన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి రిచా చద్దా టైటిల్ పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా షకీలా ఫస్ట్ లుక్ విడుదల చేశారు నిర్మాతలు. ఆసలు టాప్ అనేదే లేకుండా బంగారు ఆభరణాలను ధరించి ఓ ఘాటు పోజిచ్చింది. ఫస్ట్ లుక్ తోనే సభ్య సమాజానికి ఘాటు మెసేజ్ ఇచ్చింది. బ్యాక్ గ్రౌండ్ లో ‘ఒక ఖాన్ అయి ఉండి ఇలాంటి పనా?’.. ‘ఎంత నల్లగా ఉందో’ లాంటి వాక్యాలు రాసి ఉన్నాయి. అంటే షకీలా తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలను ఇలా రాతల రూపంలో హింట్ ఇచ్చారేమో.

ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి.. ఎస్తర్ నోరోన్హా.. రాజీవ్ పిళ్ళై.. శీవ రానా ఇతార ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా మెజారిటీ భాగాన్ని కేరళ.. కర్ణాటకలో చిత్రీకరించారట. ఈ సినిమాలో షకీలా చిన్నతనం ఎలా గడించింది.. యుక్తవయసులో అడల్ట్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి దారి తీసిన పరిస్థితులు అన్నీ చూపిస్తారట.
Please Read Disclaimer