‘మహానటి’లో ఛాన్స్ కొట్టేసిన ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్?

0shalini-pandey-love-affair`సావిత్రి జీవితచరిత్రను ‘మహానటి’ పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. సావిత్రి పాత్రను కీర్తి సురేశ్ పోషిస్తూ ఉండగా, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించనున్నాడు. రెండు కీలకమైన పాత్రల కోసం సమంతా .. ప్రకాశ్ రాజ్ లను తీసుకున్న ఈ సినిమా టీమ్, తాజాగా మరో ముఖ్యమైన పాత్ర కోసం ‘షాలిని పాండే’ను ఎంపిక చేసినట్టు సమాచారం.

తొలి సినిమా ‘అర్జున్ రెడ్డి’తోనే సక్సెస్ తో పాటు మంచి క్రేజ్ ను షాలిని పాండే సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఆమె నటన చూసిన నాగ్ అశ్విన్ .. ‘మహానటి’లో ఆమెకి ఛాన్స్ ఇచ్చినట్టు చెబుతున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.