ప్రేమలో షాలిని పాండే… అభిమాని అడిగితే అదేనందట…

0shalini-pandey-love-affairఒకే ఒక్క సినిమాతో తనేంటో నిరూపించుకుంది షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్‌గా నటించి అందాలను ఆరబోసిన షాలిని ఇప్పుడు ప్రేమలో ఉందట. అది కూడా ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. సినిమా రిలీజై ఆ తరువాత మంచి హిట్ టాక్ రావడంతో వీరిద్దరు కలిసి తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని కొన్ని రేడియోలకు కలిసి వెళ్ళిన షాలిని పాండే, విజయ్ దేవరకొండలు గంటల తరబడి ఇంటర్వ్యూలను ఇచ్చేస్తున్నారట.

అంతేకాదు ఒక అభిమాని మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉందంటూ అడగడంతో అవునంటూ షాలిని సమాధానమిచ్చిందట. దీంతో ఆ అభిమాని మీ ప్రేమ పెళ్ళి వరకు వెళ్ళాలంటూ ఆశీర్వదించిందట. షాలిని ఆ మాట చెప్పిన తరువాత తిరిగి అది నిజం కాదని చెప్పే ప్రయత్నమే చేయలేదట. వీరిద్దరు ఇప్పుడు హైదరాబాదులో కాఫీ షాప్‌లలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. వీరి మధ్య ప్రేమ ఎంతవరకు సాగుతుందో వేచి చూడాల్సిందే.