టైమంతా దానికే సరిపోయింది

0అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది సొట్ట బుగ్గల సుందరి షాలినీ పాండే. ఆ సినిమాలో లెక్కకు మించి లిప్ లాక్ సీన్లు ఉంటాయని తెలిసే చేశానని.. భవిష్యత్తులోనూ లిప్ లాక్ సీన్లు చేయడానికి తానేమీ వెనుకాబోనని అంటోంది షాలినీ. కానీ అది స్క్రిప్ట్ డిమాండ్ చేయాలని.. వల్గారిటీ కోసం అయితే ఎప్పటికీ చేయననే చెబుతోంది. సినిమాల్లో నటించాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నానని అందుకే ఇంట్లోవాళ్లు కాదన్నా పట్టుపట్టి సినిమాల్లోకి వచ్చానని అంటోందీ భామ.

‘‘ఇంజినీరింగ్ తరవాత బుద్ధిగా నేను జాబ్ చేయాలన్నది మా అమ్మానాన్నల కోరిక. నాకేమో సినిమాలంటే పిచ్చి. కాలేజ్ రోజుల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ముందుండేదాన్ని. సినిమాల్లోకి రావాలని చాలా ప్రయత్నాలు చేసి చివరకు అర్జున్ రెడ్డి హీరోయిన్ గా సెలక్ట్ అయ్యా. ఇందులో ఈ మూవీలో ఇంటిమేట్ సీన్స్ చేశానని నా బాయ్ ఫ్రెండ్ నాకు దూరమైపోయాడు అంటూ రూమర్ కూడా వచ్చింది. కానీ నాజీవితంలో ఇంతవరకు ప్రేమలోనే పడలేదు. ఇంక విడిపోవడమనే మాటెక్కడ. నా టైం.. ఓపిక అంతా నేను సినిమాల్లోకి రావడానికి మా అమ్మానాన్నల్ని ఒప్పించడానికే సరిపోయింది’’ అంటూ చెప్పుకొచ్చింది షాలినీ పాండే.

ఈమధ్య టాలీవుడ్ ను ఓ కుదుపు కుదిపిన కాస్టింగ్ కౌచ్ పైనా షాలినీ ఓపెన్ గానే మాట్లాడుతోంది. ‘‘నా ఫ్రెండ్స్ ఐటీ సెక్టార్ లో.. డాక్టర్లుగా పనిచేస్తున్నారు. అక్కడా వాళ్లకిలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వాటి గురించి ఒక్కళ్లూ మాట్లాడరు. ఇది గ్లామర్ వరల్డ్ కాబట్టి ఇక్కడి విషయాలే అందరికీ కావాలి. నేను డైరెక్ట్ గా సినిమాల్లోకి వచ్చినదాన్ని. ఇండస్ట్రీ గురించి బయట చెప్పేంత బాడ్ నాకైతే కనిపించలేదు. నాకన్నీ గుడ్ ఎక్స్ పీరియన్స్ లే ఎదురయ్యాయి.’’ అంటూ టాలీవుడ్ కు గుడ్ సర్టిఫికెట్ ఇచ్చింది షాలినీ.