నిఖిల్ సినిమాలో అర్జున్ రెడ్డి లవర్ ?

0nikhilఒక్క సినిమాతో స్టార్ అయిపోయింది షాలిని పాండే. ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో ఆమె పేరు హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆమెకు వరుసగా ఆఫర్లు అందుతున్నాయి. ఇప్పటికే తమిళ్లో రెండు సినిమాలు అంగీకరించింది.

అయితే సెలెక్టివ్ గా సినిమాలు ఒకె చేస్తోంది షాలిని పాండే. స్క్రిప్ట్ లు చూసి, క్యారెక్టరైజేషన్ తెలుసుకుని కానీ అంగీకరించడం లేదు. ఇప్పుడు శాలినీపై హీరో నిఖిల్ చూపుపడింది.గణితన్ సినిమాని తెలుగులో రిమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాలో షాలిని పాండే ని అనుకుంటున్నారు. ఆమె కూడా దాదాపు ఓకె చెప్పింది. సంతోష్ డైరక్ట్ చేయబోయే ఈ సినిమా మార్చి2న సెట్స్ పైకి వెళ్లనుంది.