అందాల విందుతో వేదాంతం!

0

ఎంతోమంది బ్యూటీలు.. ఈలోకానికి తమ అందంతో వెలుగులు పంచుతూ ఉంటారు. అలాంటి మిషన్లో ఫుల్ బిజీగా ఉన్న వారిలో రాజస్థానీ బ్యూటీ షమ సికిందర్ పేరును మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న పాత్రలు మాత్రమే చేసిన షమ బుల్లి తెరపై మాత్రం తన సత్తా చాటింది. ‘ఏక్ ఖిలాడి ఏక్ హసీనా’ లాంటి సీరియల్స్ తో పాటు ‘మాయ’ వెబ్ సీరిస్ తో ప్రేక్షకులను మెప్పించింది.

అందరు అందగత్తెలు చేసినట్టే ఇన్ స్టాగ్రామ్ లో హాటు పిక్కులు పోస్ట్ చేయడం కుర్రాళ్ళ నిద్రను చెడగొట్టడం ఆమెకున్న చాలా ఇంట్రెస్టింగ్ హాబీలలో ఒకటి. రీసెంట్ గా అలానే ఒక ఘాటు చిత్రం పోస్ట్ చేసింది. పారదర్శకంగా ఉండే నలుపు రంగు గౌన్ తో అందాలను విందు చేస్తూ తన కురులను సుతిమెత్తగా సవరించుకుంటూ ఓ శృంగార రాణిలా పోజిచ్చింది. మరి ఈ ఘాటు పోజుకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ చదివితే ఆమెలో ఒక రచయిత్రి ఉందని మనకు వెంటనే అర్థం అవుతుంది.

ఆమె క్యాప్షన్ ఇలా ఉంది “నాకు ఒకే కోరిక ఉంటే – అది నీ శ్వాస సవ్వడి నా మెడ మీద పడుతూ .. నీ పెదవుల వెచ్చదనం నా బుగ్గపై.. నీ వేళ్ళ స్పర్శ నాకు తగులుతూ.. నీ హృదయ స్పందన నా హృదయ స్పందనతో మమేకమౌతూ ఉన్నప్పుడు.. ప్రతి రోజూ నిద్రలేవాలనుంది. ఈ భావన నీతో తప్ప మరే ఇతర వ్యక్తితో రాదన్న విషయం కూడా నాకు తెలుసు.” దీనికి తోడు # అబ్ దిల్ కీ సున్ అనే హ్యాష్ ట్యాగ్ జత చేసింది. కవిత్వం అదిరి పోయిందిగా.. ఇక మీరు మీ సాధారణం లోకం లోకి వచ్చి మీ వాట్సాప్ చెక్ చేసుకోండి..!
Please Read Disclaimer