కపూర్ వంశంలో కొత్త బికినీ!

0

బాలీవుడ్ లో నెపోటిజం ఉందని చాలామంది ఏడుస్తూ ఉంటారు గానీ ఒక విషయం మాత్రం మర్చిపోతారు. అదేంటంటే నెపోటిజం ఫాలో అయినా కొడుకులను మాత్రమే హీరోలు చేయలనుకోరు.. కూతుళ్ళను కూడా హీరోయిన్లు చేస్తారు. వారు వీరు అని తేడా లేకుండా ఖాన్లు కపూర్ల కూతుర్లు ఇప్పుడు హీరోయిన్లు అవుతున్నారు. ఇప్పుడు తాజాగా షనాయా కపూర్ కూడా ఆ లిస్టు లో చేరడానికి సిద్ధం గా ఉంది.

ఇంతకీ షనాయా ఎవరింటే బోనీ కపూర్ .. అనిల్ కపూర్ ల తమ్ముడు సంజయ్ కపూర్ కుమార్తె. అంటే అర్జున్ కపూర్.. జాన్వీ.. ఖుషి.. సోనమ్ కపూర్ లకు కజిన్. షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కు ఈమె క్లోజ్ ఫ్రెండ్. ఇక ఈ బ్యాక్ గ్రౌండ్ చాలదా ఈ 18 ఏళ్ళ భామ బికినీలతో విరుచుకుపడి సోషల్ మీడియా హీటు పెంచేందుకు? మరి అక్కల దారిలోనే హీరోయిన్ కావాలని డిసైడ్ అయిందో ఏమో గానీ ఈమధ్య హాటు హాటు బికినిలతో ఇన్ స్టాగ్రామ్ తాట తీస్తోంది.

స్విమ్మింగ్ పూల్ లో తేలుతూ ఉండే ఒక వాటర్ చైర్ లో యువరాణి లాగా షనాయా కూర్చొని ఉంది. ఇక బికిని మెరుపులు సరేసరి. ఇప్పటికైతే ఇన్ స్టాలో ఫాలోయర్స్ నంబర్ చాలా తక్కువగా ఉంది గానీ త్వరలో ఆ నెంబర్ పెరగడం ఖాయం.
Please Read Disclaimer