శంకర్ నుండి భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

0

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తాజా చిత్రం ‘2.0’ నవంబర్లో విడుదలకు సిద్ధం అవుతోంది. భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమాకోసం ప్రేక్షకులు ఎంతో అసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాగానే శంకర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘భారతీయుడు 2’ పై వర్క్ చేస్తానని ఇప్పటికే ప్రకటించాడు. ప్రస్తుతం ‘భారతీయుడు 2’ ప్రీ-ప్రొడక్షన్ జోరుగా సాగుతోందట.

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ ‘భారతీయుడు 2’ లో వీఎఫ్ఎక్స్ ఉండదని క్లారిటీ ఇచ్చాడు. విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమా డిలే అవుతోందని అందుకే వీలైనంతవరకూ గ్రాఫిక్స్ లేకుండా పూర్తి చేస్తానని తెలిపాడు. అంతేకాదు. ‘భారతీయుడు 2’ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ గురించి హింట్ ఇచ్చాడు. ఆ సినిమా ఒక సైన్సు ఫిక్షన్ థ్రిల్లర్ అని సినిమా స్టొరీకి ఒక ఇంట్రెస్టింగ్ నేపథ్యం ఉంటుందని తెలిపాడు.

ఈ లెక్కన కమల్ హాసన్ తో చేసే ‘భారతీయుడు’ సీక్వెల్ ను త్వరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాదికి ఆ సై-ఫై సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. ‘2.0’ సినిమాకే 500 కోట్లు అన్నాడు.. ఇక ఆ సినిమాకు ఎన్ని కోట్ల బడ్జెట్ కావాలంటాడో ఈ స్టార్ డైరెక్టర్.. భారీ ఫిగర్ బయటకు వచ్చేలోపు మీరు గుండె దిటవు చేసుకొని ఉండండి. ఏ 1500 కోట్లో .. 2000 కోట్లో అంటే మళ్ళీ మీరు కళ్ళు తిరిగి పడే అవకాశం ఉంటుంది.
Please Read Disclaimer