బాహుబలికి – 2.0కి తేడా అదే..

02.0.. సౌత్ ఇండియా అగ్రదర్శకుడు శంకర్ రూపొందిస్తున్న మూవీ టీజర్ నిన్న రిలీజ్ అయ్యింది. మిలియన్ల వ్యూస్ వచ్చాయి.. కానీ బాలీవుడ్ వాళ్లు ఏం కూసినా.. టాలీవుడ్ వాళ్లు ఎంత చప్పరిచ్చినా.. కోలీవుడ్ వాళ్లు నెత్తిన పెట్టుకున్నా.. ఒక్కటి మాత్రం నిజం.. 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టిన మూవీపై బోలెడు అంచనాలుంటాయి. ఆ అంచనాలు అందుకోలేదన్నది సగటు ప్రేక్షకుడి మాట.. ఇది రోబోకు సీక్వెల్ గా.. దాని పోలికలుతో ఉండడమే పెద్ద మైనస్ అని అభిమానులు పేర్కొంటున్నారు. క్రిటిక్స్ కు ఇదే విమర్శలకు అవకాశం ఇస్తోంది..

2.0 ట్రైలర్ లో రోబో ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన పలు సీన్లు కాపీ కొట్టారు.. రోబో చిట్టీ గన్స్ తో కాల్చే సీన్ కానీ.. సెల్ ఫోన్లు అన్నీ గాల్లోకి ఎగరడం కానీ.. ఆ తర్వాత ఫోన్లు రోబోట్ లుగా మారి యుద్ధానికి సిద్ధమవుతున్న దృశ్యాలు రోబో ఫస్ట్ పార్ట్ లో వేరే సందర్భంలో ఉన్నాయి. వాటిని మళ్లీ చూపించేసరికి అందరికీ నిరుత్సాహం కలిగింది.

ఇక దీని గ్రాఫిక్స్ పనితనం కూడా ఆహో ఓహో అంటున్నా మొదటి సినిమాకు దగ్గరగా పోలికలతో ఉండడమే పెద్ద మైనస్.. 400 కోట్లకు పైగా బడ్జెట్ అంటున్న సినిమాపై దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ ను శంకర్ 2.0 అందుకోలేదన్నది విమర్శకుల మాట..

నిజానికి రాజమౌళి తీసిన బాహుబలిపై బోలెడు అంచనాలున్నాయి. మొదటి పార్ట్ విడుదలై సక్సెస్ అయ్యాక రెండో పార్ట్ పై విపరీతమైన హైప్ వచ్చింది. దానికి కారణం రాజమౌళి విడిచిన సస్పెన్సే.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల సభలో సాక్షాత్తూ ప్రధాని మోడీ కూడా కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు అని అన్నాడంటే రాజమౌళి సృజనాత్మకత అర్థం చేసుకోవచ్చు. ఇక బాహుబలి2 ఫస్ట్ ట్రైలర్ లో కూడా బాహుబలిని చంపే సీక్రెట్ నే పెట్టి రాజమౌళి సినిమాపై హైప్ పెంచాడు.

కానీ ఈ హైప్ – సృజనాత్మకతే శంకర్ 2.0లో మిస్ అయ్యిందని జనాలు మాట్లాడుకుంటున్నారు. రేడియేషన్ – ఫోన్లతో నష్టం వంటి సామాజిక అంశాన్ని తీసుకున్నా.. మొదటి పార్ట్ లోని యాక్షన్ సీన్లు రిపీట్ అవ్వడం.. అలాగే కథలో సస్పెన్స్ లేకపోవడం 2.0కు పెద్ద మైనస్ అని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక టీజర్ ను చూసి మొత్తం సినిమాను అంచనావేయడం తొందరపాటే అవుతుంది. శంకర్ దిగ్గజ దర్శకుడు నో డౌట్.. పెద్ద పెద్ద రైటర్స్ ఈ సినిమాకు పనిచేశారు. అక్షయ్ కుమార్ – రజినీకాంత్ లాంటి హేమా హేమీలున్నారు. సో ఎంతైనా కథా బలం ఉన్న సినిమానే.. మరి వచ్చే దీపావళికి విడుదల కాబోతున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత సంచలనాలు సృష్టిస్తుందనేది చూడాలి మరి..