2.0 మేకింగ్ వీడియోతో మళ్లీ మ్యాజిక్‌

0భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌తో కలిసి మరోసారి మ్యాజిక్‌ చేసేందుకు సిద్ధమైపోయాడు. వీరిద్దరి కాంబోలో మూడో చిత్రంగా 2.0 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్ర మేకింగ్ వీడియోను శంకర్ కాసేపటి క్రితం రిలీజ్ చేశాడు.

రోబోగా రజనీ మళ్లీ కనిపించటం, విలన్‌ అక్షయ్‌ కుమార్ తో తలబడటం, అమీ జాక్సన్‌తో స్టంట‍్లు, కాస్టింగ్ మేకోవర్లు, భారీ యాక్షన్‌ సన్నివేశాలు… టోటల్‌గా హాలీవుడ్‌ నిపుణుల పర్యవేక్షణలో చిత్రం రూపొందించినట్లు అర్థమైపోతుంది.

శంకర్‌ మేకింగ్‌ వీడియో చివర్లో విక్టరీ సింబల్‌ చూపించిన స్టైలిష్ సూపర్‌ స్టార్‌ను చూడొచ్చు. 2018 రిపబ్లిక్‌ డే సందర్భంగా 2.0 రిలీజ్ కానుంది.