స్టార్ డాటర్ ఎక్స్ పోజింగ్

0కింగ్ ఖాన్ షారూక్ డాటర్ సుహానా ఖాన్ త్వరలో కథానాయికగా తెరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్రిటన్(యుకే)లో విద్యాభ్యాసం చేస్తున్న సుహానా తరచూ ముంబై టు ఫారిన్ ట్రిప్స్ తో బిజీబిజీ. ఇక్కడకి వచ్చినప్పుడల్లా కరణ్ జోహార్ అంకుల్ వద్ద నటనకు సంబంధించిన టిప్స్ తీసుకుంటోంది. మరోవైపు విదేశాల్లో నటశిక్షణ తీసుకుందన్న ప్రచారం ఉంది. అదంతా సరే.. ఇక సుహానా డెబ్యూ బరిలో దిగే టైమ్ వచ్చిందని రీసెంటుగా ఓ మ్యాగజైన్ ఫోటోషూట్ పక్కాగా క్లారిటీ ఇచ్చింది.

రీసెంటుగానే ప్రఖ్యాత మ్యాగజైన్ కోసం సుహానా ఎంతో వైబ్రేంట్ గా ఫోటోషూట్ లో పాల్గొంది. అలసట అన్నదే లేకుండా రోజంతా ఆ షూట్ లోనే పాల్గొంది. ఆ ఫోటోలు ప్రస్తుతం వెబ్ లో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు ఖాన్ అభిమానుల నుంచి గొప్ప స్పందన వచ్చింది. సుహానా బరిలో దిగితే ఇక వార్ వన్ సైడేనన్న టాక్ కూడా వినిపించింది. అందుకు యుద్ధ సన్నాహకం ఇదేనన్న సంకేతం తాజాగా కనిపిస్తోంది.

ఇదిగో ఇటీవలే ఇలా యుకే నుంచి ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చిందిలా. అల్ట్రా మోడ్రన్ డిజైనర్ డ్రెస్ లో ఇలా విమానం దిగింది. డాడ్ షారూక్ తో కలిసి కట్టుదిట్టమైన భద్రత నడుమ అలా తేలిగ్గా అడుగులు వేసింది. బాటమ్ లో టైట్ ఫిట్ బ్లాక్ ట్రాక్ షూట్ – పైన సింపుల్ గా ముడి వేసిన గళ్ల చొక్కా.. లోనెక్ బనియన్ తో సుహానా కేక పుట్టించింది. ఈ డ్రెస్ లో సుహానా టీనేజీ మిసమిసల్ని అస్సలు దాచుకోలేకపోయిందంటే నమ్మండి. కాబోయే స్టార్ హీరోయిన్ అందుకే ఇలా ఇప్పటినుంచే జనాలకు అలవాటు చేస్తున్నట్టుంది. అచ్చం షారూక్ నోట్లోంచి ఊడిపడిందా? అన్నట్టు కనిపించే సుహానా ఇప్పటికి బబ్లీగా కనిపిస్తున్నా.. స్టార్ అయితే ఆ లుక్ మొత్తం షేపప్ అవుతుందనడంలో సందేహం లేదు.