యంగ్ ఎన్టీఆర్ గా శర్వా ?

0విశ్వ విఖ్యాత నట స్వారభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తనయుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా తేజ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం సక్సెస్‌ఫుల్ హీరో శర్వానంద్‌ను చిత్రబృందం సంప్రదించినట్టు తెలుస్తోంది. యంగ్ ఎన్టీఆర్ రోల్‌లో నటించాలని శర్వాను కోరినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 29న ప్రారంభం కానుంది. సంక్రాంతి కానుకగా 2019 జనవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.