సిద్దార్థ్ కథలో శర్వా హీరో

0

హీరో సిద్ధార్థ్ లో కేవలం నటుడు మాత్రమే కాదు.. అతడిలో దర్శకరచయిత కూడా ఉన్న సంగతి తెలిసిందే. అసలు తన కెరీర్ ఆరంభమైందే అసిస్టెంట్ డైరెక్టర్ గా .. 2003లో `బోయ్స్` సినిమాతో హీరో అయ్యి అటుపై అంచెలంచెలుగా ఎదిగాడు. 16 సంవత్సరాల కెరీర్ లో తెలుగు-తమిళం- హిందీలో చెప్పుకోదగ్గ సినిమాల్లోనే నటించాడు. ప్రస్తుతం తమిళంలో నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే తెలుగులో కెరీర్ మాత్రం డైలమా కొనసాగుతోంది. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించేందుకు అద్భుతమైన కంటెంట్ తో వస్తున్నానని సిద్ధూ లేటెస్ట్ గా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే సిద్ధార్థ్ టాలీవుడ్ లో తన స్నేహితులందరికీ ఇప్పటికీ టచ్ లో ఉన్నాడు. తాజాగా తన స్నేహితుల్లో ఒకరైన వెర్సటైల్ స్టార్ శర్వానంద్ కి సిద్ధార్థ్ ఓ కథ పంపించాడని తెలుస్తోంది. ఈ కథ శర్వాకి అయితేనే సూటవుతుందని అతడి వద్దకు ఓ దర్శకుడిని పంపించాడట. శర్వా ఆ కథ విని వెంటనే ఓకే చెప్పాడు. వాస్తవానికి సిద్ధార్థ్ చేయాల్సిన సినిమా ఇది… కథ ఫెంటాస్టిక్ గా ఉంటుంది.. అంటూ శర్వానంద్ కి అత్యంత సన్నిహితులు వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమాని కూడా పట్టాలెక్కించే ఆలోచనలో అతడు ఉన్నాడట.

మరోవైపు శర్వా ప్రస్తుతం శర్వా 27 శర్వా 28 చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా టాకీ చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. వేరొకటి.. తమిళ బ్లాక్ బస్టర్ 96 రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్- సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మాతృక దర్శకుడు ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కెన్యా షెడ్యూల్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత ఆ కొత్త దర్శకుడితో శర్వా 29 సెట్స్ కెళ్లే ఛాన్సుందని తెలుస్తోంది. అలాగే ఆ చిత్రాన్ని తెలుగు – తమిళ్ ద్విభాషా చిత్రంగా తెరకెక్కించనున్నారట.
Please Read Disclaimer