‘పడిపడి లేచే మనసు’ రిలీజ్ డేట్ ఇదే

0శర్మానంద్ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘పడిపడి లేచే మనసు’ మూవీ విడుదల తేది ఖాయమైంది. డిసెంబర్ 21న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్రం యూనిట్ నిర్ణయించింది. తాజాగా కోల్ కతాలో ఓ భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక సినిమా చివరి షెడ్యూల్ ను నేపాల్ దేశంలో ప్లాన్ చేశారు.

తెలుగులో మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో ప్రేమకథలను తెరకెక్కించడంలో దర్శకుడు హను రాఘవపూడికి మంచి పేరుంది. తాజాగా మరోసారి అలాంటి ప్రేమకథనే నమ్ముకొని ‘పడిపడిలేచే మనసు’ చిత్రాన్ని తీశారు. ఈ సినిమాను క్రిస్ మస్ పండుగను బేస్ చేసుకొని విడుదల చేసేందుకు యూనిట్ రెడీ అయ్యింది.

తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. శర్వానంద్ – సాయిపల్లవిలు ప్రేమ మైకంలో ఒకరినొకరు చూసుకుంటున్న ఫొటో యువ హృదయాలను కొల్లగొడుతోంది. వీరిద్దరి జోడి బాగా కుదిరిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సునీల్ – మురళీశర్మలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సినిమా నిర్మించారు.