పవర్ఫుల్ టైటిల్ కోసం గాలిస్తున్న శర్వా – సుధీర్

0

ఒక సినిమా జనాల్లోకి చొచ్చుకుపోవాలన్నా.. సినిమాను చూడాలనే అభిప్రాయం కలిగించాలన్నా టైటిల్ చాలా కీలకం. అందుకే ఫిలిం మేకర్లు సినిమా టైటిల్ ఎంపిక విషయంలో చాలానే కసరత్తు చేస్తుంటారు. ఇప్పడు శర్వా – సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ప్రస్తుతం ఇలాంటి కసరత్తే జరుగుతోందట. జస్ట్ లవ్ స్టొరీ అనుకోండి.. ఏదో ఒక సాఫ్ట్ టైటిల్.. లేదా కవితాత్మకంగా ఉండే పేరు పెట్టుకోవచ్చు. కానీ ఈ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ అవసరం. ఎందుకంటే శర్వా రెండు షేడ్స్ లో కనిపిస్తాడు. పైగా గ్యాంగ్ స్టర్.. మాఫియా డాన్ లాంటి పాత్ర. అందుకే పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఉండే టైటిల్ కోసమే చూస్తున్నారట.

ఇప్పటికే కొన్ని టైటిల్స్ పరిశీలించినా అవేవీ వర్క్ అవుట్ కావడంలేదట. మొదట్లో ‘దళపతి’ అనే టైటిల్ పరిశీలించారట కానీ ఆ టైటిల్ ను ఎవరో రిజిస్టర్ చేసిపెట్టుకున్నారట. తర్వాత ఇంద్రగంటి – నాని సినిమాకు వినిపించిన ‘వ్యూహం’ టైటిల్ ను కూడా పరిశీలించారట. కానీ ఈ టైటిల్ అదోరకంగా ఉందని.. డబ్బింగ్ సినిమాల టైటిల్ ను గుర్తు తెస్తోందని సన్నిహితులు అన్నారట. ‘పార్థు’ అనే టైటిల్ కూడా చర్చలోకి వచ్చిందని కాకపోతే వైబ్రేషన్స్ లేవని వదిలేశారట. ప్రస్తుతానికి టైటిల్ వేట ఇంకా కొనసాగుతోందని.. త్వరలోనే ఒక మంచి టైటిల్ ను ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ ఆగర్వాల్.. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ప్రశాంత్ పిళ్ళై. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సమ్మర్ సీజన్ లోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Please Read Disclaimer