రణరంగంలోకి శర్వానంద్

0

పడి పడి లేచే మనసు తర్వాత ఐదు నెలల పైగా గ్యాప్ వచ్చేసిన శర్వానంద్ తన కొత్త సినిమాతో రెడీ అవుతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ ఇవాళ సాయంత్రం ఫస్ట్ లుక్ తో పాటు విడుదల చేయనున్నారు. అయితే దీనికి సంబంధించిన లీక్ బయటికి వచ్చేసింది. దాని ప్రకారం దీనికి రణరంగం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా తెలిసింది.

ఇది అఫీషియల్ ప్రకటన రూపంలో మరికాసేపట్లో ప్రకటిస్తారు. శర్వానంద్ ప్రస్థానం తర్వాత అంత ఇంటెన్సిటీ ఉన్న రోల్ మళ్ళి చేయలేదు. రణరంగంలో అంతకు పదింతలు హీరోయిజంతో పాటు హై వోల్టేజ్ యాక్షన్ ఉంటుందని ఇన్ సైడ్ టాక్. షూటింగ్ చివరిదశలో ఉన్న రణరంగం మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేసుకుంటోంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో మొదలై శర్వా గ్యాంగ్ స్టర్ గా ఎదిగే క్రమాన్ని కొత్తగా ప్రెజెంట్ చేసినట్టు తెలుస్తోంది.

కాజల్ అగర్వాల్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మరో పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు శర్వానంద్. విడుదల తేదీ ఇవాళే ప్రకటించే అవకాశం ఉంది. శర్వానంద్ గ్యాంగ్ వార్ ని చూసి చాలా కాలమైన నేపథ్యంలో అభిమానులు దీని మీద ప్రత్యేకమైన అంచనాలు పెంచుకోవడం సహజం. రణరంగం టైటిల్ ఎలాగూ పవర్ ఫుల్ గా ఉంది కాబట్టి దానికి తగ్గ కంటెంట్ ఉంటే హిట్టు పడ్డట్టే
Please Read Disclaimer