విరాట పర్వం చూపించబోతున్న శర్వానంద్

0ప్రస్తుతం చాలా మంది హీరోలు ఒకసారి నటించిన హీరోయిన్స్ మరోసారి నటించడం లేదు. గతంలో రిపీట్ అయినట్టుగా ఇప్పుడు పెద్దగా అలాంటి కాంబినేషన్స్ కు క్రేజ్ కూడా రావడం లేదు. సినిమాలో స్ట్రాంగ్ మ్యాటర్ ఉంటేనే కాంబినేషన్స్ సక్సెస్ అవుతాయని కొన్ని సినిమాలు రుజువు చేశాయి. ఇకపోతే ఫెస్టివల్ హీరో శర్వానంద్ ఇప్పుడు ఒక హీరోయిన్ ను రిపీట్ చేయనున్నాడు. ఆమెతో చేసిన మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.

కానీ అప్పుడే రెండవ సినిమా కోసం ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు. ఫిదా బ్యూటీ సాయి పల్లవి. మొదటి సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయిపోయిన ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. శర్వానంద్ నెక్స్ట్ సినిమా పడి పడి లేచే సినిమాలో అమ్మడు ఆల్ రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పుడు శర్వానంద్ మరో కొత్త దర్శకుడితో చేయడానికి ఒప్పుకున్నాడు.

ఛలో సినిమాతో మంచి హిట్ అందుకున్న వెంకీ కుడుముల చేయబోయే ఒక వింటేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీకి శర్వా ఒకే చెప్పేశాడు. త్వరలోనే సినిమాను కూడా స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారు. ఇక సినిమా టైటిల్ ను విరాట పర్వం 1992 అనుకుంటున్నట్లు టాక్. మహాభారతం లోని విరాట పర్వం అంశం ఇందులో ఏమైనా ఉంటుందా అనే సందేహం కలుగుతోంది. 1992 లో నడిచే సోసియో – పొలిటికల్ డ్రామాగా దర్శకుడు కథను రాసుకున్నట్లు సమాచారం.