ఇది నిజమేనా శర్వా?

0మొదలుపెట్టడం ఆలస్యమైనా ఇప్పుడు వేగం అందుకున్న ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన ఫోటో లీక్స్ అప్పుడపుడు బయటికి వస్తున్నప్పటికీ యూనిట్ తానుగా ఏది చెప్పడం లేదు. వచ్చే సంక్రాంతి విడుదల టార్గెట్ చేసారు కాబట్టి దానికి అనుగుణంగా వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు క్రిష్. అందరు పేరున్న నటీనటులనే తీసుకురావడం ద్వారా రిచ్ నెస్ తీసుకొచ్చే విషయంలో రాజీ లేకుండా చూసుకుంటున్నాడు. ఇందులో పాత్ర కోసం తనను సంప్రదించినట్టు ఇటీవలే శర్వానంద్ చెప్పిన సంగతి అందరికి గుర్తే. కానీ తాజాగా వినిపిస్తున్న ఫిలిం నగర్ టాక్ ప్రకారం శర్వా అందులో నుంచి బయటికి వచ్చేసాడట. కారణాలు తెలియదు కానీ పాత్ర మంచిదే అయినప్పటికీ వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ సినిమాను పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటారు కాబట్టి అది తనకు ఇబ్బంది కలగవచ్చేమో అనే ఉద్దేశంతో డ్రాప్ అయినట్టుగా ఆ గాసిప్ సారాంశం.

ఇది నిజమో కాదో ఇప్పుడే నిర్ధారణగా చెప్పలేం కానీ శర్వానంద్ ను తొలుత ఎన్టీఆర్ యుక్త వయసులో ఉన్నప్పటి పాత్ర కోసం అడిగారట. కానీ అంత పెద్ద నటుడి పాత్ర అంటే సహజంగానే పోలిక వస్తుంది కాబట్టి ఎందుకొచ్చిన ఇబ్బంది అని వదులుకున్నట్టు మరో టాక్ కూడా ఉంది. బాలయ్య కానీ క్రిష్ కానీ బయటికి వచ్చి దీని విశేషాలు ఇలాంటి డౌట్స్ పట్ల క్లారిటీ ఇచ్చే తీరికలో లేరు. సో ఇది నిజామా కాదా మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఎన్టీఆర్ నటజీవితాన్ని హై లైట్ చేస్తూ క్రిష్ రూపొందిస్తున్న ఈ మూవీలో బాలయ్య గెటప్స్ ఓ రేంజ్ లో ఉంటాయట. ఇప్పుడు శర్వా డ్రాప్ అయ్యాడు కాబట్టి ఆ ప్లేస్ లో మోక్షజ్ఞతో ఎంట్రీ ఇప్పించే విధంగా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. బాలయ్య మరి ఎటువైపు మొగ్గు చూపుతాడా వేచి చూడాలి. శర్వానంద్ లాంటి సమాన స్థాయి హీరో ఉంటే సమస్య లేదు. దొరకలేదు అంటే మనవడిగా మోక్షజ్ఞ వేయటమే కరెక్ట్. లాంచ్ కూడా గ్రాండ్ గా జరిగినట్టు అవుతుంది. చూడాలి ఈ వార్తలు ఎంతవరకు నిజమవుతాయో .