ఆస్కార్‌ వేడుకలో శ్రీదేవికి నివాళి

0అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌ డాల్బీ థియేటర్‌లో ఆస్కార్‌ వేడుక అట్టహాసంగా కొనసాగుతోంది. ది. భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 6.30 గంటలకు ఈ వేడుక ప్రారంభమైంది. ఈ సందర్భంగా దివంగత బాలీవుడ్‌ నటులు శశికపూర్‌, శ్రీదేవికి నివాళులు అర్పించారు.

ప్రముఖ అమెరికన్‌ సంగీత దర్శకుడు ఎడ్డీ వెడ్డర్‌ స్టేజ్‌పైన సంగీత ప్రదర్శనతో వీరికి నివాళులు అర్పించారు. 2017 డిసెంబర్‌లో శశికపూర్‌ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.

ఇక అతిలోక సుందరి శ్రీదేవి వారం క్రితమే తిరిరాని లోకాలకు వెళ్ళిపోయారు 2018 ఫిబ్రవరి 25న దుబాయ్ లో శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి కన్నుమూశారు.