పదేళ్ల తర్వాత కూడా అదే అందం

0బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ఎంతటి సొగసరి అనే సంగతి తెలుగు జనాలకు కూడా తెలుసు. కెరీర్ ఫుల్లు ఫామ్ లో ఉండగానే.. తెలుగులో కూడా చకచకా పెద్ద సినిమాల్లో నటించేసి.. మన సాహసవీరుడు వెంకటేష్ కి సాగరకన్యగా కూడా మురిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వెలిగిపోయిన ఈ భామ.. యోగా బ్యూటీగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

పొడుగు కాళ్ల సుందరి అని ముద్దుగా పిలిపించుకునే ఈ భామకి.. ప్రస్తుతం వయసు ఇప్పుడు కాసింత ఎక్కువే. రెండేళ్ల క్రితమే 40ల్లోకి వచ్చేసిన శిల్పా శెట్టి.. ఇప్పటికీ థర్టీస్ అందాలనే మెయింటెయిన్ చేస్తోంది. ఇంకా చెప్పాలంటే.. పదేళ్ల నుంచి ఈమె వయసు అసలు పెరగడమే మానేసిందా అనిపించక మానదు. టీనేజ్ మెరుపులను ఇప్పుడు చూపించడం కష్టమే కానీ.. తనకు 30ల ప్రారంభంలో ఎలా ఉందో.. ఇప్పుడు ఫార్టీ ప్లస్ కు వచ్చేసినా అదే తరహాగా బాడీని.. మెరుపులను చూపిస్తుండడం మాత్రం గమనించాలి.

బీచ్ లో బికినీలతోను.. ఆ తరహా డ్రెస్సులలోనూ బాలీవుడ్ భామలు కనిపించడం కొత్తేమీ కాదు. చిన్నపాటి డ్రెస్సులతో శిల్పా శెట్టి సందడి చేస్తున్న రెండు ఫోటోలను కంపేర్ చేస్తూ.. సోషల్ మీడియా జనాలు రచ్చ చేస్తున్నారు. వీటిలో ఒకటి 2008లో దిగిన ఫోటో అయితే.. మరొకటి రీసెంట్ పిక్. ఈ రెండింటిలోను అమ్మడి ఫిజిక్ లో ఏ మాత్రం తేడా కనిపించడం లేదు. నిజంగానే శిల్పా శెట్టి వయసు పెరగడం ఆగిపోయిందేమో?