సాగరకన్య బర్త్ డే సంబరాలు చూశారా

0బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి సినిమాలకు వీడ్కోలు చెప్పి నాలుగేళ్లు అవుతున్నా ఇంకా జనాలకు టచ్ లోనే ఉంది. టాలీవుడ్ జనాలకు కూడా ఈ బ్యూటీ పరిచయమే. కె.రాఘవేంద్ర రావు – వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సాహస వీరుడు సాగర కన్య సినిమాలో జలకన్య గా కనిపించి అందరిని ఆకర్షించింది. ఆ సినిమా తరువాతే శిల్పా బాలీవుడ్ మరిన్ని మంచి అవకాశాలు అందుకుంది.

ఇకపోతే అమ్మడు ఇటీవల తన 43వ పుట్టినరోజును జరుపుకుంది. తన కుటుంబ సభ్యుల సమక్షంలో భర్త రాజ్ కుంద్రా సెట్ చేసిన స్పెషల్ కేక్ ను కట్ చేసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంది. కేక్ లో శిల్పా బొమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. శిల్పా పుట్టిన రోజు సందర్బంగా ఇతర సినీ తారలు కూడా వారి విషెస్ ను అందించారు. నెటిజన్స్ అయితే వివిధ రకాల ఫోటో ఎడిటింగ్ తో సీనియర్ నటికీ శుభాకాంక్షలు తెలిపారు. అది చూసి శిల్పా ఎంతో ఆనందపడింది. సూపర్ సూపర్ అంటూ భర్తను పొగిడేసింది. ఇక అభిమానులు కూడా ఆ వీడియో బావుంది అంటూ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి 43 ఏళ్ల వయసొచ్చాక కూడా అంత హాటుగా కనిపించడం అంటే శిల్పాకే చెందింది. అందుకే ఆమె చేసే యోగాలన్నా వాటి తాలూకు వీడియోలన్నా కూడా అభిమానులకు చాలా ఇష్టం.