స్కర్టు వేసుకుంది.. జస్ట్ సేవ్ అయ్యింది

0అవార్డ్ షో జరుగుతున్నప్పుడు కానీ ఏదైనా సినిమా ఫంక్షన్ అవుతున్నప్పుడు కానీ మన హీరోయిన్లు వింత వింత బట్టలు వేసుకొని వస్తుంటారు. ఇంకా ఫ్యాషన్ షోలో అయితే చెప్పే పనే లేదు. శరీరంపై అలా అంటీ అంటనట్లు ఉండి.. అందాలన్నీ దారబోసేలా కొన్ని బట్టలు డిజైన్ చేసుంటాయి. ఈ బట్టలు ఫ్యాషన్ షో లో అయితే ఎలాగైనా ఉండవచ్చు కానీ అదే రెడ్ కార్పెట్ పై కానీ ఏదైనా ఫంక్షన్ కి కానీ అటువంటి డ్రెస్ వేసుకొని వెళ్ళాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోకపోతే అంతే సంగతలు.

మన హీరోయిన్లు పబ్లిక్ లో కి వచ్చినప్పుడు కొన్ని సార్లు వాళ్ళు వేసుకున్న బట్టలు వారి మాట వినకుండా కొంత ఇబ్బంది పెడుతు ఉంటాయి. బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టికి అటువంటి అనుభవమే ఎదురుపడవలిసింది కాని తన అనుభవం కాపాడింది అనే చెప్పాలి. శిల్పా శెట్టి గత రాత్రి ఒక బర్త్ డే ఫంక్షన్ కు వెళ్ళి వస్తుండగా గాలికి తన పొట్టి గౌన్ ఎగిరిపోతుంటే ఠక్కున పట్టుకొని పెద్ద ప్రమాదం నుండే తప్పించుకొంది. బయటకు వస్తున్నప్పుడు మెట్లు దగ్గర తను వేసుకున్న వైట్ గౌన్ అంచులు గాలి సవ్వడికి కొంచెం ఇరకాటం పెడితే ఆ అంచులను సరైన సమయంలో పట్టుకొని సేవ్ అయిపోయింది. లేదంటే అక్కడే ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్లు ఈ వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ను ఖచ్చితంగా కెమెరాలో బంధించి నానా రచ్చా చేసేవారు.

ఇలాంటి కురచ బట్టలు మన హీరోయిన్లు బయట వేసుకోక మానరు వాటినే వేసుకొని నానా తంటాలు పడక మానరు. కాకపోతే ఇలాంటి బట్టలు వేసుకున్నప్పుడు కనీసం ఫోటోగ్రాఫర్లకు దూరంగా ఉంటేనైనా బెటర్ అంటూ సోషల్ మీడియాలో వీరికి సలహాలు వినిపిస్తున్నాయి.Shilpa-Shetty-saved-herself-from-wardrobe-malfunction